తెలంగాణ

మనవాళ్లు డిజిటల్ ముదుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: కంప్యూటర్లు వినియోగించడంలోనూ, నిరంతరం సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేయడంలోనూ, అతిగా డిజిటల్ వినియోగంలోనూ తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలోనే ఉన్నాయి. మొత్తం మీద మనవాళ్లు డిజిటల్ ముదుర్లేనని ఇటీవల ఇంటెల్ కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పింది. భారతదేశం సహా 14 దేశాల్లో ఇంటెల్ కార్పొరేషన్ ఈ సర్వేను నిర్వహించింది. వినియోగదారులు డిజిటల్ ప్రవర్తనలపై ఈ సర్వే లోతైన అధ్యయనం చేసింది. పర్యటనల్లో ఉన్నపుడు సైతం కార్యాలయాలకు సంబంధించిన మెయిల్స్‌ను పరిశీలించడంలో మనవాళ్లు ముందే ఉన్నారు.
హైదరాబాద్‌కు చెందిన వారు కేవలం 38 శాతం మంది మాత్రమే పర్యాటక సెలవుల్లో కార్యాలయ మెయిల్స్‌కు దూరంగా ఉంటుండగా, ఢిల్లీ, ముంబై వాసులు 41 శాతం, అహ్మదాబాద్ వాసులు 43 శాతం, బెంగళూరు వాసులు 51 శాతం మెయిల్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే సైబర్ దాడులకు అవకాశం కల్పించే పబ్లిక్ వైఫైని ఉపయోగించి సున్నిత సమాచారాన్ని పంచుకోవడంలో భారతీయులు ఇతరులు కన్నా అగ్రస్థానంలో ఉన్నారని ఈ సర్వేలో తేలింది. ప్రయాణ సమయాల్లో వినియోగదారులు డిజిటల్‌గా ఏ విధంగా కనెక్టు అవుతున్నారో తమకు తెలియకుండానే వారు ఏ విధంగా తమ వ్యక్తిగత వివరాలను, ఉపకరణాలను ముప్పునకు గురిచేస్తున్నారో తెలియజేసేందుకు ఈ సర్వే చేపట్టారు.
హైదరాబాద్‌లో ప్రజానీకం గత ఏడాది మూడింట రెండొంతుల మంది వెకేషన్‌పై వెళ్లారు, ఆ సమయంలో ఆఫీసు మెయిల్స్‌కు దూరంగా ఉండాలని వారు భావించినా, 82 శాతం మంది ఇంటర్నెట్‌కు అనుసంధానం కావల్సి వచ్చింది. వెకేషన్‌లో ప్రయాణీకులు సైబర్ నేరగాళ్లకు చిక్కే అవకాశం ఉందని, వినియోగదారులు డేటాను, ఉపకరణాలను యాక్సెస్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు నిరంతరం ప్రయత్నిస్తుంటారని అన్‌సెక్యూర్డు స్మార్టు ఫోన్స్, లాప్‌టాప్స్, చివరకు వేరియబుల్స్ ద్వారా సోషల్ చానల్స్ ద్వారా సున్నిత సమాచారాన్ని యాక్సెస్ అవుతున్నారని ఈ సర్వేలో తేలిందని ఇంటెల్ సెక్యూరిటీ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఆర్ అండ్ డి ఆపరేషన్స్ హెడ్ వెంకటకృష్ణాపూర్ తెలిపారు.
హైదరాబాద్ నుండి వెకేషన్‌కు వెళ్లిన వారిలో 82 శాతం మంది స్మార్టు ఫోన్‌ను విరివిగా వాడుతున్నారని, మరో 62 శాతం మంది కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేస్తుండగా, మరో 44 శాతం మంది అత్యవసర పరిస్థితుల కోసం ఫోన్ వాడుతున్నారని తేలింది. 28 శాతం మంది ప్రయాణంలో ఉన్నపుడే పబ్లిక్ వైఫై ద్వారా సున్నిత సమాచారం యాక్సెస్ చేస్తున్నారని, మరో 35 శాతం మంది సామాజిక మాధ్యమాలు చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేమని చెప్పారని వెంకట్ చెప్పారు.