రాష్ట్రీయం

రవాణా సేవలు మరింత మెరుగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఆర్టీసి అందించే రవాణా సేవలు మరింత మెరుగుపడాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి సూచించారు. తెలంగాణ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, రవాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తదితర అధికారులతో కలసి ఆయన గురువారం రవాణా సౌకర్యాలపై సమీక్షించారు. తెలంగాణ రవాణ శాఖ ఎం-వాలట్, ఈ-బీమా, ఆన్‌లైన్ విధానాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, ఇదే తరహలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన సిఫార్సులు, ప్రతిపాదనలు ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలలోని రవాణా శాఖ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది కొత్తగా ప్రతిపాదిత 27 జిల్లాలు ఏర్పడితే వాటిలో జిల్లాల వారీగా ఉండాల్సిన కార్యాలయాలతోపాటు ఉద్యోగ వ్యవస్థీకరణ, పంపిణీ అంశాలను చర్చించారు. ప్రతిపాదిత అంశాలలో ప్రతీ జిల్లాకు జిల్లా రవాణ అధికారి (డిటిఓ) ఉండేలా చూడాలని, రెండు లేదా మూడు జిల్లాలకు కలసి డిటీసిలు సమన్వయకర్తలుగా ఉండి పర్యవేక్షణ, రోడ్డు భద్రత అంశాలను అమలు పరుస్తూ కిందిస్థాయిని పర్యవేక్షించాలని చర్చకు వచ్చింది. జిల్లాలో అధికారులు వృత్తి హోదాను,స్థాయిని మార్చకుండా వ్యవస్థీకరించేలా ఉండాలని అధికారులు చర్చించారు. ఎక్సైజ్ వాఖ తరహాలో అధికారుల కేటాయింపు ఉండాలని, ఆర్టీసిలో జిల్లా స్థాయిలో డివిఎంలు ఉండాలని, రెండు నుంచి నాలుగు జిల్లాలకు రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం)లు ఉండాలని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాలకు రవాణా శాఖ కార్యాలయాలను రానున్న రోజుల్లో సొంత భవనాలలో ఏర్పాటు చేస్తామని, దసరా నుండి అమలతోన్న జిల్లాలకు ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటు, స్థల సేకరణ అంశాలపై దృష్టిసారించాలన్నారు. శంషాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో ఆర్టీసి డిపోలు లేకపోవడంతో వాటికి అధికారుల పర్యవేక్షణ ఏవిధంగా ఉండాలనే అంశంపై మంత్రి అధికారులతో చర్చించారు. ఆర్టీసి రీజియన్లు రోడ్డు భవనాల శాఖతో అనుసంధానంగా ఉండాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జెటిసిలు వెంకటేశ్వర్లు, రఘునాథ్, ఈడి నాగరాజు, డిటిసి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం హైదరాబాద్‌లో టి.మంత్రి మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న టి.ఆర్టీసీ అధికారులు