రాష్ట్రీయం

ఆదాయం 46వేల కోట్లు ఖర్చు 49వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.46,051 కోట్ల ఆదాయం రాగా, రూ.49,686 కోట్ల మేర ఖర్చులు తేలాయి. ఫలితంగా 3వేల కోట్ల వరకు లోటు ఏర్పడింది. రాష్ట్రానికి ఆదాయ వనరులుగా ఉన్న వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, రవాణా శాఖలలో అంచనాల మేరకు వసూళ్లు జరగటం లేదని గురువారం ఏపి సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు నేతృత్వంలో ఉపసంఘం జమ, ఖర్చులు, ఆదాయ మార్గాలపై సచివాలయంలోని ఫైనాన్స్ మినిస్ట్రీ చాంబర్‌లో సమావేశమయ్యారు. పట్టణాల్లో జనసాంద్రత పెరగటంద్వారా సేవల రంగం అభివృద్ధి చెందుతోందని రాబడికూడా పెంచుకోవచ్చనే అంశంపై సమావేశం దృష్టి సారించింది. ఆంతరంగికంగా జరిగిన ఈ సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వివరించారు. రానున్న కాలంలో పట్టణీకరణ వృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. దీనివల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు లేకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ప్రైవేటు భాగస్వామ్యంతో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు. గృహనిర్మాణ పథకం అమలులో ప్రభుత్వం బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. మైన్స్ అండ్ మినరల్స్‌లో వృద్ధి సాధించే అవకాశం ఉన్నప్పటికీ వెనుకబడి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై పునస్సమీక్షించి ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులు, పురపాలక సంఘాల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించటం జరిగిందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

చిత్రం.. మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న యనమల