రాష్ట్రీయం

నరుూం గ్యాంగ్‌పై భీమిలిలో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, సెప్టెంబర్ 1 : భూవివాదంలో నరుూం మనుషులమని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు విశాఖ జిల్లా భీమిలి సిఐ టి. అప్పలనాయుడు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలి మండలం కాపులుప్పాడలో సర్వే నెంబర్లు 117/5, 117/6, 117/4, 117/7, 117/9, 117/22, 185/2లలో సుమారు అయిదెకరాల మేర భూమిని 1988లో విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అంపావల్లికి చెందిన బొడ్డూరి భూషణం అన్ రిజిస్టర్ ద్వారా కొనుగోలు చేసేందుకు స్థలాల యాజమాన్యాల నుండి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఆయన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే భూషణం 2014లో తన భూమి వద్దకు వెళ్లి చూడగా అవి ఆక్రమణకు గురి కావడం గమనించాడు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన దంతులూరి సూర్యనారాయణవర్మ ఆ భూమి తనదని, 2007లో తాము కొనుగోలు చేశానని, పైగా తాము నరుూం మనుషులమని తెలిపాడు. తమకు అడ్డొస్తే అంతు చూస్తామని సూర్యనారాయణవర్మ భూషణాన్ని బెదించారని సిఐ వివరించారు. పైగా తనను కులం పేరుతో దూషించినట్లు భూషణం తెలిపాడన్నారు. వీటిపై గతనెల 21న భూషణం తమకు ఫిర్యాదు చేసినట్లు సి ఐ తెలిపారు. అయితే కృష్ణా పుష్కరాల నిమిత్తం తాము ఇక్కడ లేమని, దీంతో పాటు భూషణాన్ని కులం పేరుతో దూషించారన్న దానిపై నరుూం మనుషులుగా భావిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ సెల్ ఎసిపి మోహనరావు కేసును చూస్తున్నారని సిఐ అప్పలనాయుడు తెలిపారు.

చిత్రం.. కేసు వివరాలు వెల్లడిస్తున్న భీమిలి సిఐ అప్పలనాయుడు