రాష్ట్రీయం

ఇక తెలంగాణలో ‘ఏపి ఉద్యోగులు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న 300 మంది ఉద్యోగులను తమ సంస్థల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్రప్రభుత్వానికి పంపాయి. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలవడనున్నాయి. తాము తెలంగాణలో పనిచేసేందుకు వీలుగా రిలీవ్ చేయాలని ఈ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. కాని ఏపి ప్రభుత్వం వీరిని రిలీవ్ చేయలేదు. దీంతో వీరు తమను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యుత్ సంస్థల యాజమాన్యాన్ని కోరారు. కాగా తెలంగాణ విద్యుత్ సంస్థలు 1259 మంది ఆంధ్ర స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేయగా, ఆంధ్రప్రభుత్వం వీరిని చేర్చుకోలేదు. ఈ వివాదం ఉన్నత న్యాయస్థానం పరిధిలో పెండింగ్‌లో ఉంది. 9వ షెడ్యూల్‌లో విద్యుత్ సంస్థలు ఉన్నాయని, ఏపి పునర్విభజన చట్టం ప్రకారం వీటి ఆస్తులు, అప్పులు పంపకం కాకుండా ఉద్యోగులను రిలీవ్ చేయడమనేది న్యాయ సమ్మతం కాదని ఏపి విద్యుత్ సంస్థల అధికారులు పేర్కొన్నారు.