రాష్ట్రీయం

మళ్లీ చంద్రుల భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: కృష్ణా జల వివాదాలపై కేంద్ర జలవనరుల శాఖ కదిలింది. జల కేటాయింపులపై పరస్పర విమర్శలతో కుస్తీపడుతున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల మూడవ వారంలో అనుకూలమైన తేదీలను సూచించాలని, దీనికి అనుగుణంగా సమావేశాన్ని ఖరారు చేస్తామని కేంద్రం ఇరు రాష్ట్రాలకు వర్తమానం పంపింది. కృష్ణా జల వివాదాలపై కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి (ఎపెక్స్ కౌన్సిల్) సమావేశాన్ని నిర్వహించి పరిష్కరించాలని ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్ రెండు రాష్ట్రప్రభుత్వ కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఈ సమావేశం ఢిల్లీలో ఉండవచ్చని సమాచారం. ఒకసారి తేదీలు ఖరారైతే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సిఎంలతోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల అధికారాలు కృష్ణా బోర్డుకు ఇవ్వాలని బోర్డు గతంలోనే కేంద్రాన్ని కోరింది. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు తెలంగాణ ససేమిరా అంటోంది. జూరాలనుంచి ప్రకాశం బ్యారేజీ వరకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు తెలంగాణ సమ్మతి తెలియచేయగా, నాగార్జునసాగర్ వరకు చాలని, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ పరికరాలను అమర్చేందుకు ఏపి నిరాకరిస్తోంది.
రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల స్కీంలపై ఏపి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టులు అక్రమమని ప్రకటించాలని కేంద్రాన్ని ఏపి కోరింది. కాని తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పరిస్ధితుల్లో ఈ ప్రాజెక్టులపై రాజీపడే ప్రసక్తిలేదని, కృష్ణా జలాల్లో తమ కేటాయింపులకు అనుగుణంగానే నీటిని వినియోగించుకుంటామని తేల్చిచెప్పింది. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం ప్రాజెక్టునుంచి ఎడాపెడా నీటిని తోడుతున్నారని తెలంగాణ కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. జల విద్యుత్‌లో కూడా సగం వాటా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువున నీటి వినియోగం జరపరాదని, నిల్వ ఉంచాలని, దీనివల్ల రాయలసీమ సాగునీటి ప్రయోజనాలకు అటంకం కలగదని ఏపి వాదిస్తోంది. కాగా 837 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జీవోలు ఉన్నాయని, కరవుకాలంలో తాగునీటిని ఆ మట్టం వరకు నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ చెబుతోంది.