రాష్ట్రీయం

పేదరిక నిర్మూలనకు కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 23: విద్య నేర్పించటం, వైద్యం అందించటం, పేదలను ఆదుకోవటం లాంటి సేవా కార్యక్రమాల్లో క్రిస్టియన్లు ఎప్పుడూ ముందుంటారని, వారు కలిసివస్తే పేదరిక నిర్మూలన కోసం పనిచేసేందుకు ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో బుధవారం క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన ఆయన 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఏసుప్రభువు సాక్షిగా పేదరికం నిర్మూలన కోసం పని చేస్తానన్నారు. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అయితే కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చూస్తున్నారని, వారి పట్ల క్రిస్టియన్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమాజంలో ఎవరు నమ్ముకున్న మతాన్ని వారు స్వేచ్ఛగా అనుసరించే అవకాశం ఉండాలన్నారు. పేద క్రిస్టియన్ల అభివృద్ధిని కాంక్షిస్తూ కొందరు ఉదారంగా ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను మత పెద్దలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవ స్థలాల అన్యాక్రాంతాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కాబినెట్ సబ్ కమిటీ వేసి వాటిని రక్షిస్తామన్నారు. మత మార్పిడి చేసుకున్న వారికీ ఎస్‌సీ హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జెరూసలేం సందర్శనానికి వెళ్లే క్రైస్తవుల కోసం 50 లక్షల రూపాయల నిధిని ఏర్పాటు చేసిందన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జెరూసలేం వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సిఎం చంద్రబాబు అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల గృహాలకు 50 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవులకు అందించారు. విద్య, వైద్యం, సేవా తదితర రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న 9 మందిని సన్మానించారు. మంత్రులు రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాధరెడ్డి నేతృత్వంలో జరిగిన సభకు 13 జిల్లాలకు చెందిన బిషప్‌లు, రెవరెండ్ ఫాదర్లు విచ్చేశారు.