రాష్ట్రీయం

రైల్వేలో ఇక సోలార్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: కాలుష్యరహిత, ఇంధన పొదుపు సాధ్యపడి, ఆర్థిక భారాన్ని తగ్గించుకునే అవకాశాలున్న సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు కోసం ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ జోన్ పరిధిలో తొలిసారిగా వాల్తేరు డివిజన్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ను ఆదా చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలపట్ల ఆసక్తి కలిగి ఉండే కార్పొరేట్ సంస్థలను ఇప్పటికే ఆహ్వానించింది. ఎ,బి ప్యాకేజీలుగా ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. అయితే, వీటిలో తక్కువ కోట్ చేసే ఏజెన్సీకి ఈ ప్రాజెక్టును కేటాయించాలని డివిజన్ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తయితే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. ఇందుకోసం విశాఖ రైల్వేస్టేషన్‌లోనే కొంత స్థలాన్ని డివిజన్ కేటాయిస్తుంది. తొలుత విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసుకుని దీని ద్వారా ఇందులో ఉన్న సర్వీసు బిల్డింగ్‌లు, దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న డీజిల్, ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లు, రైల్వేస్టేషన్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కు ఈ సోలార్ పవర్ ప్రాజెక్టును ఉపయోగించాలని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ణయించారు. ఎనిమిది కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి 25 ఏళ్లపాటు దీని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ సంస్థ తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఏడాదికి కనీసం 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చనేది అధికారులు అంచనా.
సోలార్ పవర్ వాడకం పెరిగినకొద్దీ వాల్తేరు డివిజన్‌కు విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకునే అవకాశాలున్నాయి.