తెలంగాణ

కొత్త హంగులతో టి-సర్కార్ టీవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: కొనే్నళ్లుగా పెద్దగా ఉపయోగంలో లేని రాష్ట్ర ప్రభుత్వ టీవి చానళ్లను, మనటీవీని నూతన పోకడలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మనటీవీని పూర్తిగా మార్చనున్నట్టు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. మనటీవీ చానల్ ద్వారా నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు, గృహిణులకు ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు. గతంలో 60 వేల పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రసారాలు అందించారు. సీనియర్ జర్నలిస్టు శైలేష్‌రెడ్డిని సిఇఓగా నియమించి సాఫ్ట్‌నెట్‌గా మార్చారు. గుజరాత్‌లో బైసాక్ నెట్‌వర్క్ ద్వారా 16 చానళ్లు ప్రసారం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రసారాలను పరిశీలించి ఒక నివేదికను ఐటి మంత్రికి అందజేశారు కూడా. తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు, యువకులకు శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఉండాలని కెటిఆర్ సూచించారు. దీంతోపాటు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర స్కిల్స్ అందేలా ఉండాలని అన్నారు. రైతులకు సూచనలు సైతం ప్రసారం చేయాలని నిర్ణయించారు. మనటీవీని ప్రతి ఇంటికి చేరే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. ఇప్పుడున్న ఆర్‌ఓటిల స్థానంలో డిజిటల్, కేబుల్, డిష్ టీవి వంటి ఫ్లాట్‌ఫాంల ద్వారా మన టీవీ ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం ఇస్రో చైర్మన్‌తో ఐటి మంత్రి కెటిఆర్ సమావేశం అయ్యారు. కెయూ బ్యాండ్ నుంచి సి బ్యాండ్‌కు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కొత్త పేరు సూచించండి
మన టీవికి కొత్త పేరు, లోగోను ఏర్పాటు చేయనున్నారు. మంచి పేరు, క్రియేటివ్ లోగో సూచించిన వారికి 51వేల రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు సాఫ్ట్‌నెట్ సిఇఓ శైలేష్‌రెడ్డి తెలిపారు. ఐటి శాఖ వెబ్‌సైట్‌లో పేరు, లోగో సూచించాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న మన టీవీ (సాఫ్ట్‌నెట్) కార్యాలయంలో నేరుగా కానీ, పోస్ట్ ద్వారా కానీ అందజేయవచ్చునన్నారు.