ఆంధ్రప్రదేశ్‌

సాధికారత సర్వేకి నిధుల గ్రహణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 4: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికారత సర్వేకు నిధుల గ్రహణం పట్టింది. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సర్వేను ప్రారంభించారు. అయితే సిఎంకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారమే ఇప్పటికీ ప్రొఫార్మాలో పూర్తికాలేదు. ముఖ్యమంత్రి ఓటరు ఐడితో పాటు ఆధార్ కార్డులు హైదరాబాద్‌లో నమోదయి ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు బదిలీ చేయలేదని సమాచారం. రాష్టవ్య్రాప్తంగా వివిధ జిల్లాల్లో సర్వే ప్రహసనంగా మారుతోంది. వీఆర్వోలకు అదనపు బాధ్యతలు ఉండటంతో ప్రస్తుతం తాత్కాలిక బ్రేక్ పడింది. కొన్ని జిల్లాల్లో తగినన్ని ట్యాబ్‌లు లేక ఎన్యూమరేటర్లు అయోమయానికి గురవుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేసినా తమకు ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని ఎన్యూమరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత జూలై 6 నుంచి నెలాఖరు వరకు కొత్త కావడంతో జిల్లా కలెక్టర్లు సిఎం ఆదేశాల మేరకు సిబ్బందిని ఉరుకలు, పరుగులు పెట్టించారు. రాష్ట్రంలోని 12వేల మంది విఆర్వోలను ఎన్యూమరేటర్లుగా, మరో నాలుగు వేల మందిని సహాయకులుగా నియమించారు. రెండోవిడత కార్యక్రమం గత నెల 5 నుంచి 15వరకు కొనసాగించారు. పుష్కరాల విధుల కారణంగా 24 వరకు నిలిపివేశారు. సెలవుల అనంతరం తిరిగి ఒకటి, రెండు రోజులు అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ వారంలో పెన్షన్ల పంపిణీ ఉన్నందున బ్రేక్ పడింది. ప్రభుత్వం సర్వే నిమిత్తం ఒక్కో ఇంటికి ఎన్యూమరేటర్లకు ఐదు రూపాయలు, సహాయకులకు మూడు రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 12 నుంచి 15 వరకు ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి సర్వే ఫారాలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 50 శాతం కూడా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. సుమారు 2.4 కోట్ల కుటుంబాలకు చెందిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటిలో విచారణ జరిపి 80 కాలంలకు పైగా ఉన్న ఫారాన్ని పూర్తిచేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో కొందరు ఎన్యూమరేటర్లు ఆధార్, రేషన్ కార్డులో ఉన వివరాలనే ప్రజాసాధికార సర్వే ధృవీకరణ పత్రాల్లో పొందుపరిచి మమ అంటున్నారు.
వెబ్‌లాండ్‌ను వాయిదా వేయాలి
రెవిన్యూ ఉద్యోగులు పల్స్ సర్వేలో ఉన్నందున ప్రభుత్వం అమలు చేయనున్న వెబ్‌లాండ్ ఆటోమ్యుటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రక్రియ ప్రకారం భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహశీల్దారు కార్యాలయానికి ఆన్‌లైన్ ద్వారా ఆ రోజే వివరాలు అందుతాయి. వీటిని వీఆర్వో, ఆర్‌ఐ, తహశీల్దార్లు నెలరోజుల్లోపు సర్టిఫై చేయాలి. ఏదైనా కారణాల వల్ల చేయలేకపోతే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ జరిగిపోయే విధంగా నూతన ప్రక్రియను ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్మార్ట్ సర్వే కారణంగా ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని రెవెన్యూ ఉద్యోగసంఘాల నేతలు సీఎంఒ కార్యదర్శి సతీష్ చంద్రకు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సర్వేయర్ల కొరత ఉంది. ఆరు వేల పోస్టులకు గాను ప్రస్తుతం 600 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. వీరిలో కూడా కొందరు సీఆర్డీయేకి, మరికొందరు భోగాపురం, గన్నవరం విమానాశ్రయాల సర్వేకు నియమితులయ్యారని, ఈ పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఖచ్చితమైన వివరాలతో రిజిస్ట్రేషన్లు జరగాలంటే సర్వే పూర్తికావాల్సి ఉందని రెవెన్యూ ఉద్యోగసంఘాల నేతలు వాదిస్తున్నారు.