తెలంగాణ

చిట్టి చేతులతో తలకొరివి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, సెప్టెంబర్ 4: అన్ని తానై పెంచే తల్లులను చూస్తుంటాం.. కానీ లోకం తెలియని వయస్సులో ఆ చిన్నారి చంటి బిడ్డ... రోగాన పడ్డ తల్లి కోసం పడిన తాపత్రయం చూస్తే ఎవరికైనా కళ్లు చమర్చక మానవు. నాలుగు నెలలుగా ఇంటింటికీ వెళ్లి అన్నం అడిగి మరి తల్లి ఆకలి తీర్చి.. ఆ అమ్మకు అమ్మైంది. ఆదివారం తెల్లవారుజామున ఆ తల్లి మృతిచెందింతే ఏమి జరిగిందో తెలియదు.. అమ్మ లేవదు.. చనిపోయిందంటే అసలు తెలియదు... కనీసం అమ్మ అంత్యక్రియలు జరిపేందుకు డబ్బులు లేవు. అంతే ఆ చిన్నారికి అన్నీ తామై నిలిచేందుకు వరంగల్ జిల్లా కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామం అక్కున చేర్చుకుంది. ఈ విషాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన జిలుకర స్వరూప (40) పదిహేనేళ్ల క్రితం శ్రీను అనే దగ్గరి బంధువును వివాహం చేసుకుంది. వివాహంలో కలతలు... అవి మరిచేందుకు కూలి పనికోసం ఒంగోలుకు వెళ్లి అక్కడ చిన్న అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. చిన్నారి అంజలికి జన్మనిచ్చింది. సాఫీగా సాగిపోతున్న ఈ క్రమంలో మాయదారి రోగం (ఎయిడ్స్) బారిన పడి చిన్న మృతిచెందాడు. దీంతో స్వరూప సొంత ఊరు తట్టుపల్లికి చేరుకుంది. గత సంవత్సరం నుండి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో స్వరూప చిక్కి శల్యమైంది. స్వరూప ఆరోగ్యం నాలుగు నెలల క్రితం పూర్తిగా క్షీణించి మంచాన పడింది. నాలుగేళ్ల వయస్సుగల అంజలి ఇంటింటికి వెళ్లి అన్నం అడిగి తల్లి ఆకలిని తీర్చి అమ్మయంది. ఆదివారం రోజూలాగే లేచిన అంజలికి అమ్మ లేవదు.. చుట్టుపక్కల వారు వచ్చి అమ్మ చనిపోయిందంటే ఏమిటో అర్థం కాదు. దీంతో గ్రామస్థులు, ఎమ్మార్పీఎస్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో తల్లి అంత్యక్రియలకు ఇంటింటికి వెళ్లగా.. ప్రజలతో పాటు అధికారులు నాయకులు విరాళాలందించారు. చిన్నారి అంజలి పరిస్థితిని చూసి మనసున్న ప్రతి మనిషి కంటనీరు పెట్టాడు. జాగృతి నాయకుడు మట్ట సైదులు, సహాదేవ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు మందుల శ్రీను, వెంపటి చంద్రయ్య, అనబత్తుల రాములు, ఎడెల్లి వెంకన్న, బాష్పాక సైదులు, కళ్యాణ్, బాణాల నర్సమ్మ, కంచనపల్లి నరేష్‌లు శాస్త్రోయుక్తంగా అంత్యక్రియలు జరిపి, చిన్నారి అంజలితో తలకొరివి పెట్టించారు. చిన్నారి అంజలిని చైల్డ్‌లైన్‌కు అప్పగిస్తామని గ్రామస్థులు తెలిపారు.

తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న చిన్నారి అంజలి * తల్లి అంతిమయాత్రలో గ్రామస్థులతో కలసి నడుస్తున్న అంజలి * పరిస్థితులు బాగున్న రోజుల్లో తల్లిదండ్రులతో అంజలి (ఫైల్ ఫొటో)