రాష్ట్రీయం

రెడ్‌లైట్ ఏరియాను తలపిస్తున్న అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల పనితీరు రెడ్‌లైట్ ఏరియాను తలపిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. శాసనసభ్యురాలు రోజాపై సంవత్సరకాలం నిషేధం విధించడం బాధాకరమన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు తమ శాసనసభ్యులను క్రమశిక్షణలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికార పక్షసభ్యుల పట్ల ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రస్తుతం అధికారపక్షం ఎదుర్కొంటున్న పరిస్థితి భవిష్యత్తులో జగన్ కూడా చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీలో వ్యవహారాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రత్యక్ష ప్రసారాలను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేస్తే ప్రజలు సమావేశాల పనితీరును, జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి, నిర్ణయం తీసుకుంటారన్నారు. అసెంబ్లీలో వామపక్ష సభ్యులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వామపక్ష నాయకులు ఉంటే ప్రజా సమస్యలపై చర్చ జరిగేదన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ విష్ణుచక్రం లాంటివారని, ప్రస్తుతం విష్ణుచక్ర హవా తగ్గిందన్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి తగిలిందన్నారు. దేశ, రాష్ట్ర చట్టసభల్లో ప్రజా సమస్యలను గాలికివదిలి పనికిరాని సమస్యల గురించి చర్చించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.