రాష్ట్రీయం

బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: అమెరికాలో భారతీయ విద్యార్ధులు చదువుతున్న ఏ విశ్వవిద్యాలయం బ్లాక్‌లిస్టు కాలేదని, ఇమిగ్రేషన్ సమస్యలతోనే భారతీయ విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని అమెరికాకు చెందిన పలు వర్శిటీలు ప్రకటించాయి. సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీలు సైతం బ్లాక్ లిస్టును ఖండించాయి. ఇప్పటికీ ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులు వచ్చి చేరుతున్నారని వాళ్లను ఇంటర్వ్యూలు చేస్తున్నామని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ పీటర్ సిష్ తెలిపారు. కొంత మంది భారతీయ విద్యార్ధులను వెనక్కు పంపిన మాట వాస్తవమేనని, మొత్తం విద్యార్ధుల్లో వారి సంఖ్య చాలా నామమాత్రమని చెప్పారు. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిన భారతీయ విద్యార్ధులను మాత్రమే వెనక్కు పంపించారని పేర్కొన్నారు. చదువుకోవడానికా ఉద్యోగం చేయడానికా అని ప్రశ్నిస్తే కొంత మంది పార్టు టైమ్ ఉద్యోగాలు చేస్తామని చెప్పారని, పైగా చదువుకోవడానికి సరిపడా ఆర్ధిక స్థోమతుకు తగిన ఆధారాలు చూపించలేకపోయారని, తనతోపాటు విమానంలో కలిసి ప్రయాణించిన ఇతరులు ఎవరు అని ప్రశ్నిస్తే తమ బ్యాచ్ 15 మంది గురించి చెప్పడంతో వారందరినీ ఫెయిల్ చేశారని, అంతే తప్ప యూనివర్శిటీని బ్లాక్ లిస్టులో పెట్టలేదని ఆయన వివరించారు. అమెరికా చట్టాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకుని ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూల్లో తమకు ఏ తరహా వీసా లభించిందో ఆ తరహా సమాధానాలే చెప్పాల్సి ఉంటుందని, చదువుకోవడానికి వస్తూ ఉద్యోగాలు చేస్తామని చెప్పినా, ఉద్యోగాలు చెయ్యడానికి వచ్చి చదువుకుంటామని చెప్పినా వారు అనర్హులవుతారని అదే విధంగా ఫీజులు, ఆర్ధిక స్థోమతు, ఆదాయ వనరులకు సంబంధించిన సరైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ మేరకు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో వివరణ పెట్టింది. కాగా ఇబ్బందులు పడిన విద్యార్ధులకు తమ టిక్కెట్ల మొత్తాన్ని వెనక్కు ఇచ్చేందుకు ఎయిర్ ఇండియా ముందుకు వచ్చింది. కాగా కొంత కాలంపాటు అనుమానాస్పదంగా ఉన్న వర్శిటీలకు వెళ్లే ప్రయత్నం మానుకోవాలని భారతీయ విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది. వర్శిటీల బ్లాక్ లిస్టు వివరాలను అమెరికా ప్రభుత్వాన్ని కోరామని, దాని నుండి వివరణ రాగానే విద్యార్ధులకు సమాచారం అందిస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.