రాష్ట్రీయం

ప్రైవేటు వర్సిటీల బిల్లును ఆమోదించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లును తిరస్కరించాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, ఎపి కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య గవర్నర్ నరసింహన్‌ను కోరారు.
అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షం లేని సమయం చూసుకుని రాజధాని భూములను, ప్రభుత్వ భూములను 99 సంవత్సరాల ఒప్పందానికి లీజుకు ఇస్తూ బిల్లును ఆమోదించడాన్ని వారు ప్రస్తావిస్తూ ఈ బిల్లును కూడా వెనక్కి పంపించాలని బుధవారం విలేఖరుల సమావేశంలో గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు త్వరలో గవర్నర్ నరసింహన్‌ను స్వయంగా కలిసి కోరనున్నట్లు వారు చెప్పారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు అత్యంత బాధాకరంగా జరిగాయని, పెద్ద మనుషులు, మర్యాదస్తులు సభలో కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరిగిన తీరు చూస్తుంటే ఏకపక్షంగా జరిగిందని, ప్రతిపక్షం విఫలమైందని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు చేయకుండా ఆమోదించిన ప్రైవేటు యూనివర్సిటీలి ఏర్పాటు బిల్లును, భూముల లీజు బిల్లును తిరస్కరించాలని వారు కోరారు.
ప్రభుత్వ భూములను 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం ఎక్కడా చూడలేదని, సింగపూర్, జపాన్ దేశాలకు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో వ్యవహరిస్తోందని, ఈ విషయమై ప్రధాని జోక్యం చేసుకోవాలని తమ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు లోగడ ప్రధానికి లేఖ రాశారని వారు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒప్పందాలన్నీ రహస్యంగా జరుగుతున్నాయని కనుక ఈ ఒప్పందాల జివోలను అసెంబ్లీలో సభాధ్యక్షుని ముందు ఉంచాలని రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు.
2019 నాటికి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎపి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చేలా ఉన్నారని వారు విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శైలజానాథ్, తులసిరెడ్డి, మాదాసు గంగాధరం, జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.