తెలంగాణ

సునామీ హెచ్చరికలపై మాక్ డ్రిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆ కార్యాలయం నుంచి ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు... ఎందుకనుకుంటున్నారా?... సునామీ లేదా భూకంపం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తొక్కిసలాట జరగకుండా ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేసుకుంటూ ప్రమాదం నుంచి బయటపడాలో తెలియజేసేందుకు ‘మాక్ డ్రిల్’ నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో ఉన్న ఇండియన్ నేషనల్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎస్‌సిఒఐఎస్) కార్యాలయంలో సునామీ హెచ్చరికలపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎస్‌సిఒఐఎస్ డైరెక్టర్ సతీష్ శినాయ్ మీడియాతో మాట్లాడుతూ, సునామీ హెచ్చరికల వ్యవస్థలో ప్రసార మాధ్యమాల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. టివీ, రెడియో, వార్తా పత్రికలు, సోషల్ మీడియా వంటి విభిన్న ప్రసార మాధ్యమాలు ప్రజలలో చైతన్యాన్ని సులభంగా పెంచగలుగుతాయని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముందస్తు హెచ్చరికలను మీడియా సమర్థంగా పోషించిందని ఆయన అభినందనలు తెలిపారు. ఈ విపత్తు గురించి ప్రపంచానికి చాటిచెప్పి స్థానిక పరిపాలన యంత్రాంగం, ప్రభుత్వం సత్వరమే ప్రతిస్పందించేటట్లు చేసింది మీడియానేని అన్నారు. తీవ్ర సంక్షోభ సమయంలో అత్యుత్తమ హెచ్చరిక వ్యవస్థలుగా ప్రసార మాద్యమలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫీకి కమిషన్ అధ్వర్యంలో నిర్వహించిన మార్క్ డ్రిల్‌నే ‘ఐవోవేవ్16’ అని కూడా అంటారని చెప్పారు. సునామీ హెచ్చరికలను, మహాసాగర స్థితిగతులను గురించి ముందుగానే వెలువరించే అంచనాలను, కోస్తాతీర ప్రాంతాలలో నివాసముండే వారికి, నావికులకు ఎక్కువ ఎత్తులో ఎగిసిపడే అలలను గురించి అప్రమత్తత సందేశాలను అందించడం తదితర సేవలను సునామీ అర్లీ వార్నింగ్ సెంటర్ (ఐటిఇడబ్ల్యు) అందిస్తోందన్నారు. కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐవోవేవ్16 సునామీ మాక్ డ్రిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 33 కోస్తా జిల్లాల పరిధిలోని సుమారు 350 గ్రామాలలలో నుంచి దాదాపు 40వేల మందిని ఈ డ్రిల్ సందర్భంగా సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్‌లోని ఐఎస్‌సిఒఐఎస్
కార్యాలయంలో సునామీ హెచ్చరికల మాక్ డ్రిల్‌పై వివరిస్తున్న డైరెక్టర్ సతీష్ శినాయ్