తెలంగాణ

తెలంగాణ మార్కెట్లు దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మార్కెటింగ్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా ఉండేలా రూపొందిస్తామని, దేశంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకువస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ శిక్షణా తరగతులను హరీష్‌రావు బుధవారం ఇక్కడ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఎన్‌ఎఎం) విధానంలో జాతీయ స్థాయిలో 214 మార్కెట్లను అనుసంధానం చేయగా, వీటిలో తెలంగాణకు చెందిన 44 మార్కెట్లు ఉన్నాయన్నారు. ఆన్‌లైన్ మార్కెట్ విధానంలో హర్యానా మాత్రమే తెలంగాణతో పోటీ పడుతోందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానంలో ఏకీకృత లైసెన్స్, ఒకేసారి మార్కెట్ ఫీజు వసూలు చేయడం, ఆన్‌లైన్ వ్యాపార సదుపాయం కల్పించినట్టు తెలిపారు. ట్రేడింగ్ కార్యకలాపాల్లో ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాలను సులభతరం చేసేందుకు నల్సార్ లా యూనివర్సిటీతో చర్చిస్తున్నామన్నారు.
మార్కెటింగ్ విభాగాన్ని దళారులులేని వ్యవస్థగా మారుస్తున్నామని, రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా ఉన్నాయన్నారు. మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో మార్కెటింగ్ శాఖ ఈ సందర్భంగా అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నది.
పెసర కొనుగోలుకు కేంద్రాలు
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పెసర పంట ఎక్కువగా ఉందని, రైతుల నుండి నేరుగా పెసళ్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. నాఫెడ్, ఎఫ్‌సిఐ సంస్థల ద్వారా పెసళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ అంగీకరించారని గుర్తు చేశారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానంలో రైతులు తమ పంటల ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవచ్చని తెలిపారు. రైతుల ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుందని, సకాలంలో చెల్లింపులు జరుగుతాయన్నారు. దీంతో మార్కెటింగ్ వ్యవస్థలో పారదర్శకతకు అవకాశం ఉంటుందన్నారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, డిడిలు, జెడిలు అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. రైతు బజార్లను మరింత పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రైతు బజార్లకు తోడుగా రెవెన్యూ డివిజన్లలో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత అసెంబ్లీ నియోజక వర్గం స్థాయిలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ‘మన కూరగాయలు’ పథకం కింద వంద కేంద్రాలను నెలకొల్పామని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గోదాములకు తోడుగా మరో 330 గోదాములను 17 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని, వీటి నిర్మాణానికి 1024 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు.