తెలంగాణ

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. బుధవారం హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్తోన్న రవిబాబు అనే వ్యక్తి వద్ద తుపాకీ లభ్యమైంది. దీంతో విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికుడు రవిబాబును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రయాణికుడు రవిబాబు వద్ద గల బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చింది? ఆయన బుల్లెట్ విమానంలోకి తీసుకెళ్లడం వెనుకగల కారణలేమిటి? తదితర అంశాలపై ఆయనను ప్రశ్నిస్తున్నట్టు శంషాబాద్ పోలీసులు తెలిపారు. ఐసిస్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయ సిబ్బందితోపాటు పోలీసులు, ప్రత్యేక దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

‘స్విస్ చాలెంజ్’పై
నేడు సర్కారు వాదన
ముగిసిన పిటిషనర్ల వాదనలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో సింగపూర్‌కు చెందిన కన్సార్టియంకు కాంట్రాక్టును కేటాయించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్ నోటిఫికేషన్‌ను సిఆర్‌డిఏ జారీ చేసిందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. బుధవారం హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలు విన్నారు. అనంతరం వీరి వాదనలు ముగిసినట్లు ప్రకటించారు. గురువారం అటార్నీ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారని కోర్టు ప్రకటించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, సిఆర్‌డిఏ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని, బిడ్డింగ్ ప్రక్రియలో భారతీయ కంపెనీలు కూడా పాల్గొనే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. అనంతరం ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

కార్పొరేట్ ఆసుపత్రులపై
హైకోర్టులో పిల్ దాఖలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోంలలో జరుగుతున్న దోపిడీ, వైద్యుల అనైతిక విధానాలను సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం ఒక ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్) దాఖలైంది. కాని ఈ పిల్‌ను విచారించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నిరాకరించారు. తాను ఇటీవలనే ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని, దీని వల్ల ఈ పిల్ విచారణ బాధ్యతను వేరే బెంచికి బదలాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నగరానికి చెందిన కాజిపేట నరేందర్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాకం, నిర్లక్ష్యం వల్ల తన చెల్లెలు ప్రాణాలు కోల్పోయిందన్నారు. నగరంలో ఒక ఐటి ఉద్యోగి పొడువు పెంచుతామని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేయడం, దీని వల్ల తలెత్తిన దుష్పరిణామాలను ఆయన పిల్‌లో పేర్కొన్నారు. తప్పుడు విధానాలకు పాల్పడే వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన పిల్‌లో కోరారు. పిటిషనర్ ప్రస్తావించిన ఆసుపత్రుల్లోని ఒక ఆసుపత్రిలో తాను వైద్యం చేయించుకున్నందు వల్ల, ఈ కేసును మరో బెంచికి బదలాయిస్తున్నట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు.