తెలంగాణ

విభజనతో విద్యారంగానికి బొనాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యకు స్వర్ణయుగం రానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త పోస్టుల ఏర్పాటు, ఉద్యోగుల పదోన్నతులకు అవకాశం రావడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిఇఓ పోస్టులు 12 మంజూరు కాగా, అందులో 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. అలాగే జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు 10 ఉండగా అందులో ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 29 ఉండగా 26 మంది పనిచేస్తున్నారు. పరీక్షల బోర్డులో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 11 ఉండగా 10 మంది , ఆర్‌ఎంఎస్‌ఎలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 10 ఉండగా అన్నీ ఖాళీగా ఉన్నాయి. 66 డిప్యూటీ డిఇఓ పోస్టులకు 12 మంది ఉండగా, 16 గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అలాగే 75 సూపరింటెండెంట్ పోస్టులకు 73 మంది, 200 సీనియర్ అసిస్టెంట్లకు 194 మంది, 119 జూనియర్ అసిస్టెంట్లకు 114 మంది, 50 టైపిస్టులకు 28 మంది, 8మంది క్లర్లులకు ఆరుగురు, నలుగురు స్టెనోలకు అన్ని పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. 148 ఆఫీసు సబార్డినేట్‌లకు 145 మంది, 14 వాచ్‌మన్లకు 9, ఓపెన్ స్కూల్‌లో 9 జిల్లా కోఆర్డినేటర్లకు ఏడుగురు, 30 అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్లకు 19 మంది, 21 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు 10 మంది, 71 డిటిపిలకు 59 మంది, 10 ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు ఏడుగురు పనిచేస్తున్నారు. ఇదంతా 10 జిల్లాలకు అందుబాటులో ఉన్న సిబ్బంది కాగా, రానున్న రోజుల్లో 27 జిల్లాలకు వీరిని సర్దుబాటు చేయాలంటే దిగువస్థాయిలో పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించాల్సిన అనివార్యత ఏర్పడింది. మొత్తం 35 కేటగిరి పోస్టులకు 1449 మంది అవసరం కాగా, 965 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులు ఉండనే ఉన్నాయి.