రాష్ట్రీయం

‘రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని వైసిపి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డిలు మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ చంద్రబాబు ఓటుకు కోట్ల కేసు పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రం నిలదీయలేక పోతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఎన్నో ప్రయోజనాలు కలిగిన హోదాను పక్కన బెట్టి ప్యాకేజీలకు సమ్మతించడం ఏమిటని ప్రశ్నించారు. ప్యాకేజీలతో ఏపి ప్రజలకు న్యాయం జరగదని, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన దేశ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేక పోతే ఎలా అని గౌరి చరితారెడ్డి అన్నారు. హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన తరువాత కేంద్ర మంత్రి వర్గంలో టిడిపి ఎంపిలను ఎలా కొనసాగిస్తారని శ్రీ్ధర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఆ అర్హత వైసిపికి : రావెల
ఏపికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత వైసిపి లేదని మంత్రి రావెల కిషోర్, టిడిపి ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే దానిని బాగుచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే ఆయనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.