రాష్ట్రీయం

గురుకులాల్లో 657 కొత్త పోస్టులకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 657 పోస్టులను కొత్తగా ఆమోదిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి, మానకొండూరు, ఆలంపూర్, చెన్నూరు, వర్దన్నపేట, దానవాయిగూడెం, కుల్చారాం, గోపాలపేట, దోమకొండ, గచ్చిబౌలిలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 10 గురుకుల పాఠశాలలు, కరీంనగర్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, రాణికోటలో రెసిడెన్షియల్ స్పోర్ట్సు స్కూల్ నిర్వహణకు ప్రభుత్వం ఈ కొత్త పోస్టులను మంజూరు చేసింది. 10 రెసిడెన్షియల్ స్కూళ్లకు 10 ప్రిన్సిపాల్ పోస్టులు, 90 పిజిటి, 90 టిజిటి, 20 పిఇటి, 10 లైబ్రరియన్ పోస్టులు, 10 స్ట్ఫా నర్సు పోస్టులు, 10 క్రాఫ్ట్ టీచర్లు, 10 ఆర్టు టీచర్లు, 10 సూపరింటెండెంట్లు, 10 సీనియర్ అసిస్టెంట్లు, 10 వార్డెన్ పోస్టులు మంజూరు చేశారు. స్పోర్ట్సు స్కూల్‌కు 5 పిజిటి, 3 టిజిటితో పాటు ప్రిన్సిపాల్, పిడి , పిఇటి, లైబ్రరియన్, స్ట్ఫానర్సు, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, వార్డెన్ పోస్టులు మంజూరయ్యాయి. ఎక్స్‌లెన్స్ సెంటర్‌కు 19 జూనియర్ లెక్చరర్లు, 9 పిజిటిలతో పాటు ప్రిన్సిపాల్, టిజిటి, పిడి, పిఇటి, లైబ్రరియన్, స్ట్ఫానర్సు, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, వార్డెన్ పోస్టులు ఒకొక్కటి మంజూరయ్యాయి. వీటితో పాటు 324 టిజిటి పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే వీటిలో 118 పోస్టులను అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది.