రాష్ట్రీయం

24,500 కోట్లివ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: మిషన్ భగీరధ,మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతీ ఆయోగ్ సూచించిన విధంగా రూ.24,500 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు కోరారు. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన కార్యాలయంలో కెటిఆర్ సమావేశమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ని కోరామన్నారు. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచి, ఆ చట్టంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలు పాటు ఇవ్వాలని, అదే విధంగా హైదరాబాద్-వరంగల్,నాగ్‌పుర్ -హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అంతే కాకుండా ఏపి అభివృద్ధికి సహకరిస్తున్నట్లుగానే తెలంగాణ అభివృద్ధికి కూడా కేంద్రం సహకరించాలని, లేకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. తెలంగాణలో విదేశీ పరిశ్రమల ఏర్పాటుకు హామీఇచ్చి రాష్ట్రానికి భరోసా ఇవ్వాలని కోరామన్నారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను నెరవేరుస్తామని, రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జైట్లీ స్పష్టం చేసినట్టు కెటిఆర్ తెలిపారు.

చిత్రం.. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన కెటిఆర్