రాష్ట్రీయం

తిరుమలేశుడికి గద్వాల జోడుపంచెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 8: ఏటా ఎంతో వైభవంగా జరిగే తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాల మొదటిరోజు జరిగే అంకురార్పణ ఉత్సవంలో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఏరువాక జోడుపంచెలను అలంకరించనున్నారు. స్వామివారి అలంకరణ కోసం గద్వాల చేనేత కార్మికులు నెల రోజులుగా నామాల మగ్గంపై నియమనిష్టలతో జోడుపంచెల నేతపనిని పూర్తిచేసి గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 9న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అధికారికి జోడుపంచెలను అందించనున్నట్లు మహంకాళి కరుణాకర్ తెలిపారు.
సంప్రదాయబద్ధంగా పంచెల తయారీ...
ఏడుగురు నేత కార్మికులు నియమనిష్టలతో సంప్రదాయబద్ధంగా జోడుపంచెల నేతను కొనసాగించారు. సహజంగా నేత మగ్గాన్ని ఇద్దరు కలిసి ఒకేమారు నేస్తారు. అయితే నామాల మగ్గానికి మాత్రం ముగ్గురు కార్మికులు ఒకేసారి నేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేసినా నేత ముందుకు సాగదు. దైనందిన జీవితంలో తెలిసి, తెలియక తప్పులు దొర్లితే... మగ్గం దగ్గరకు వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా తెలుస్తుందని, అందువల్లనే అత్యంత జాగరూకతతో భక్తి, శ్రద్ధలతో మసులుకుంటామని నేత కార్మికులు గద్దె మురళి, కేశవ్, సాక సత్యం, షణ్ముఖరావు, మహంకాళి కరుణాకర్, మేడమ్ రమేష్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. జోడు పంచెల తయారీ మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్నచోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం... గోవిందనామస్మరణ చేసుకుంటూ నేత పనికి పూనుకుంటామన్నారు.
జోడుపంచెల ప్రత్యేకత...
11 గజాల పొడవు, ఇరువైపుల 11 అంగుళాల అంచుతో కంచుకోట కొమ్మ నగిషీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. 80 అడుగుల వెడల్పు, 13 అంగుళాల అంచు ఉంటుంది. శ్రీవారి సేవలకు దేశం నలుమూలల నుంచి ఎన్నో విలువైన కానుకలు అందినప్పటికీ వీటన్నింటిలోకెల్లా మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల సంస్థానం కానుకగా ఇచ్చే ఏరువాడ జోడుపంచెలు ప్రముఖంగా చెప్పుకోదగ్గవి. సంస్థాన రాజు శ్రీకృష్ణరాంభూపాల్‌తో మొదలైన సంప్రదాయాన్ని సంస్థానాదీశుల వారసులైన లతభూపాల్ నేటి వరకు కొనసాగిస్తున్నారు.

చిత్రాలు..చేనేత కార్మికులు తయారు చేసిన జోడుపంచెలను సిద్ధం చేస్తున్న నేతన్నలు.
తిరుమలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న స్వామివారి జోడుపంచెలు