ఆంధ్రప్రదేశ్‌

పవన్ జోలికి వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రత్యేక హోదా అంశంలో రంగంలోకి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎవరూ పల్లెత్తు మాట అనవద్దని, ఆయన జోలికి ఎవరూ వెళ్లవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆయనను తన దారిలో తనను వెళ్లనీయండి. ఒక్కొక్కరికీ ఒక్కో బాణి ఉంటుంది. హోదాపై ఎవరు పోరాడినా స్వాగతిద్దామని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
శుక్రవారం రాత్రి వరకూ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడిన బాబు, హోదా, పవన్, ప్యాకేజీ, శాసనసభలో జగన్ వైఖరిని ప్రస్తావించారు. కేంద్రంలో మనం లేకపోయినా ప్రభుత్వం నడుస్తుందని, అలాంటప్పుడు వాళ్లు ఇచ్చింది తీసుకోవడం, ఇంకా కావలసింది ఒత్తిడి చేసి తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదని స్పష్టం చేశారు. హోదా అన్న సెంటిమెంటు స్థానంలో ప్యాకేజీ వల్ల వచ్చే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్యాకేజీ వల్ల కలిగే మేలుపై ముద్రించిన పుస్తకం రేపటికల్లా మీకు ఇస్తామన్నారు. అలాగని మనం హోదా గురించి మాట్లాడటం ఆపాల్సిన అవసరం లేదని, ప్యాకేజీ-హోదా రెండూ కావాలని మనం ఎప్పటినుంచో అడుగుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ‘వాళ్లకు (విపక్షానికి) జనం గురించి బెంగ ఉండదు. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తారు. హోదా, ప్యాకేజీ రాకపోతే దాన్ని చూపించి తెదేపా ఐదేళ్ల కాలంలో ఏమీ రాలేదని చెప్పి బురద చల్లడమే వాళ్ల లక్ష్యం. కాబట్టి దాన్ని అడ్డుకోవాల’ని కోరారు.అసెంబ్లీలో జగన్ ప్రవర్తన సభ్య సమాజం తల వంచుకునేలా ఉందని, స్పీకర్ చుట్టూ మూగడం, మైకు విరగొట్టడం గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. హోదాపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు సిద్ధంగా లేని వైసీపీ కేవలం పబ్లిసిటీ, మన పార్టీపై బురద చల్లేందుకే సభలో గొడవ చేసి, సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేసిందన్న విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. కాగా, ఈ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్లు తీయడం లేదని, 80 శాతం మంది మంత్రుల తీరు ఇలాగే ఉందని ఫిర్యాదు చేశారు.