ఆంధ్రప్రదేశ్‌

హామీలపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకుంటామని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు సమానంగా కేంద్రం ఇచ్చే ఆర్థికపరమైన వెసులుబాటును వినియోగించుకుంటూనే మిగిలిన విషయాలపై పోరాడుతామని వెల్లడించారు. అన్యాయంగా జరిగిన విభజనతో ఎంతో నష్టపోయామని ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలనా ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికి జివోలు ఇచ్చి ఉంటే నేడు ఈ బాధులుండేవి కావని అన్నారు. ప్రత్యేక హోదాపై విపక్షాలు దుర్మార్గం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనపైన, దాని వల్ల జరిగిన నష్టంపై మాట్లాడకుండా, కాంగ్రెస్ దయతో బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదాపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని బాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు అనేది తెలుగు జాతి కల అని, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, తమ ప్రభుత్వం కృషి వల్లే దేశంలోనే ఎక్కడా లేని పోలవరం ప్రాజెక్టుకు దక్కిందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు తాను 12 సార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చించానని, రూ. 1800 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 2018లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావలన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 50వేల ఎకరాల స్థలాన్ని సేకరించటంతో పాటు భూములిచ్చే బాధితులకు ప్రత్యామ్నాయంగా భూమి ఇప్పించటం, పునరావాసం కల్పించటం వంటి అనేక అంశాలపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని చెప్పారు. అయినా ప్రాజెక్టు ఖర్చును వంశాతం వ్యయాన్ని చెల్లిస్తామని కేంద్రం చెప్పినట్లు ఆయన వివరించారు. ప్రత్యేక హోదా రాకుంటే ఏటా రూ. 60వేల కోట్లు ఏపి నష్టపోతుందని 14 వ ఆర్థిక సంఘం పేర్కొన్నట్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు అది ఎలాగో వివరించాలని బాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం పదకొండు సంస్థలను ప్రారంభించాల్సి ఉండగా, అందులో తొమ్మిది ప్రారంభమయ్యాయని, అగ్రికల్చర్, సెంట్రల్ యూనివర్శిటీలకు భూములు కేటాయించినా, ఇంకా బిల్లు పెట్టాల్సి ఉందన్నారు. అలాగే కడప స్టీలు ప్లాంటు, విజయవాడలో గానీ, కాకినాడలో గానీ రూ. 30వేల కోట్లతో హెచ్‌పిసిఎల్ ఆయిల్ రిఫెండరీ ఏర్పాటు చర్చల స్థాయిలో ఉన్నాయన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఎయిర్‌పోర్టుల కోసం స్థలాలను సేకరించామని తెలిపారు. వెనుకబడిన ఏడు జిల్లా అభివృద్ధి కోసం మూడేళ్లలో రూ.వెయ్యి 50 కోట్లు మంజూరు చేశారని, మరో వెయ్యి 50 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రయోజనాలే గాక, కేంద్రం రాష్ట్రానికి ఇంకా చాలా చేయాలని, ఇందుకు త్వరలోనే ఓ లేఖ రాయనున్నట్లు బాబు వెల్లడించారు. హోదా సాధించటంలో తాను విఫలమయ్యానంటూ, అందుకు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయటంపై స్పందించిన ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే హామీలన్నీ నెరవేరుతాయా? ప్రత్యేక హోదా వస్తుందా? అని ప్రశ్నించారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ అనేది ఎప్పటికీ ఉంటుందని ఉద్ఘాటించారు. పోరాటం ద్వారానే రావల్సినవన్నీ దక్కించుకుంటామని, ఇందులో రాజీ ప్రసక్తేలేదని బాబు స్పష్టం చేశారు.విశాఖపట్నంలోనే రైల్వే జోన్‌ను ప్రకటించాలన్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. ఏ మాత్రం అవకాశమున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే కేంద్రం వత్తిడి తెస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.

చిత్రం... హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు