తెలంగాణ

నెలాఖరు నుంచే వర్క్ టు సర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: కొత్తగా ఏర్పాటవుతోన్న జిల్లాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రాధాన్యతలకు అనుగుణంగా శాఖల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది కోసం ప్రతిపాదనలు వెంటనే ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ప్రతిపాదనలను సిజిజి వెబ్‌సైట్‌లో (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఆప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించారు. ప్రతిపాదనల ఆధారంగా కొత్త జిల్లాలకు కేటాయించే సిబ్బందికి ‘వర్క్ టు సర్వ్’ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు రాజీవ్ శర్మ వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం కలెక్టర్లు, వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పడే జిల్లాలకున్న ప్రత్యేకాంశాలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు, జనాభా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని శాఖల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది వివరాలను ఆప్‌లోడ్ చేయడంతోపాటు విధిగా ఆర్థికశాఖకు తమ ప్రతిపాదనలు అందించాలని సిఎస్ ఆదేశించారు. వీటికోసం ప్రత్యేకంగా ఆర్థిక శాఖలో సెల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మండలాలు, రెవిన్యూ డివిజన్లలో అక్టోబర్ 11నుంచే కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా వ్యవసాయ, రెవిన్యూ, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు అవసరమైన సిబ్బంది కోసం ప్రతిపాదనలు పంపాలని సిఎస్ ఆదేశించారు. అలాగే మండలాలవారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకంపైనా విధిగా ప్రతిపాదనలు పంపించాలన్నారు. కొత్త జిల్లాల్లో ఉండబోయే పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి శాఖా విధిగా తమ శాఖలో పని చేస్తున్న సిబ్బంది, గుర్తించిన కార్యాలయాలు, అవసరమైన వాహనాల వివరాలతో ఆర్గానోగ్రామ్, రీ డిప్లైమెంట్, సర్దుబాటు వివరాలు వెంటనే సిజిజి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల వివరాలతో పాటు ప్రస్తుతం తాత్కాలిక ప్రతిపాదికపై పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జాబితాలనూ అందుబాటులో ఉంచుకోవాలని రాజీవ్ శర్మ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్రతోపాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్‌కె జోషి, బిపి ఆచార్య, సోమేష్ కుమార్, అజయ్ మిశ్రా, ఆధర్ సిన్హా, సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శులు శివశంకర్, నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కొత్త జిల్లాలపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సిఎస్ రాజీవ్ శర్మ