తెలంగాణ

సిట్ అదుపులో మరో అనుచరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం అతని అనుచరులు ఒక్కొక్కరుగా ఊచలు లెక్కబెడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య అనుచరులను అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా శుక్రవారం కృష్ణమూర్తి అలియాస్ కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణారావుకు ముంబై, హైదరాబాద్ శివారుల్లో ఖరీదైన ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. నరుూం బంధువు సలీమాబేగంకు కృష్ణారావు సన్నిహితుడు. నరుూం అండదండలతోనే కృష్ణారావు ఆస్తులు కూడబెట్టుకున్నట్టు గుర్తించినట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. కృష్ణారావుపై భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్ వంటి పలు కేసులు ఉన్నట్టు తెలిసింది.
అదేవిధంగా నరుూం మరో అనుచరుడు శివను అదుపులోకి తీసుకున్నారు. నరుూం ముఖ్య అనుచరులతో శివ ఫోన్ సంభాషణలు జరిపినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా శివ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన శివ అలియాస్ శివకుమార్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా నరుూంకు ఆయుధాలు సమకూర్చిన శ్రీ్ధర్‌గౌడ్, సమీరుద్దీన్‌ను 9రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరి నుంచి నరుూంకు చెందిన డంప్‌ల సమాచారాన్ని రాబడుతున్నట్టు సమాచారం. ఇదిలావుండగా నరుూం అక్రమ వ్యవహారాలపై నల్గొండ, మెదక్ జిల్లాల్లో మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి.
నల్గొండకు చెందిన మహేశ్వరి, ఎద్దుమైలారంకు చెందిన డిఫెన్స్ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నరుూం బాధితులు ఎవరైనా నిర్భయంగా నేరుగా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని సిట్ అధికారులు సూచించారు.