తెలంగాణ

చల్లారని విభజన సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 9: జిల్లాల పునర్విభజన సెగలు ఆదిలాబాద్ జిల్లాలో వేడిపుట్టిస్తూనే ఉన్నాయి. వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాను ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆనాలోచితంగా మూడు జిల్లాలుగా విభజించడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లో తెలంగాణ తొలి ఉద్యమకారులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. గతంలో ప్రతిపాదించిన విధంగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలను విభజించాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మల్ జిల్లాను ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ 1969లో తెలంగాణ రాష్టస్రాధన కోసం పోరాడి జైలుకెళ్ళిన ఉద్యమకారులు శుక్రవారం నల్ల కండువాలు కప్పుకొని ఆదిలాబాద్ తెలంగాణ చౌరస్తాలో దీక్షలు చేశారు. ఇదిలావుంటే ఉట్నూరు ఏజెన్సీ కేంద్రాన్ని జిల్లా చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి అధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. అఖిలపక్ష సాధన సమితి అధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఏజెన్సీ సమస్యలపై ప్రత్యేక జిల్లా కేంద్రం కోసం వినతిపత్రం సమర్పించారు. కడెం మండలం మల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బుట్టాపూర్ అనుబంధ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
వరంగల్‌లో...
వరంగల్: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు రగడ కొనసాగుతూనే ఉంది. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ నర్మెటలో ఎబివిపి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. లింగాలఘణపురం మండల కేంద్రంలో ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలోనే తమను కలపాలంటూ హసన్‌పర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చి వినతిపత్రం అందచేశారు. పరకాలను డివిజన్ కేంద్రంగా చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ వాకాటి కరుణను కలిసి వినతిపత్రం అందచేశారు.
కరీంనగర్‌లో...
కరీంనగర్: కొత్త జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై జిల్లాలోని పలుచోట్ల నాన్‌స్టాప్‌గా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు అవకాశాలు లేవని, జిల్లా కేంద్రాలకు దీటుగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానంటూ మంత్రి కెటిఆర్ విడుదల చేసిన బహిరంగ లేఖ మరింత ఆజ్యం పోసింది. ఆందోళనకారులు భగ్గుమన్నారు. శుక్రవారం ఉద్యమకారులు నిరసనలను ఉధృతం చేశారు. సిరిసిల్లలోని మున్సిపల్, సెస్ కార్యాలయాలను ముట్టడించి రాజీనామాలు చేయాలని పట్టుబట్టారు. మంత్రి కెటిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తోసహా 12 మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు. వీర్నపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో మంత్రి కెటిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీటితోపాటు సిరిసిల్ల జిల్లా కోసం వేములవాడలో, రెవెన్యూ డివిజన్ కోసం కోరుట్లలో, జిల్లా కోసం హుజురాబాద్‌లో, కరీంనగర్‌లోనే కొనసాగించాలంటూ హుస్నాబాద్, కోహెడలలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగగా, ఆందోళనకారులు వివిధ రకాల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.