తెలంగాణ

హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, సెప్టెంబర్ 9: హత్యకేసులో నలుగురు ముద్దాయిలకు అయిదవ అదనపు సెషన్స్ జడ్జి సి.పి.విందేశ్వరి జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. 2012 ఫిభ్రవరి 11న నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం బీమనపల్లి గ్రామంలో గంగదేవి పర్వతాలును కత్తులు, గొడ్డళ్లతో నరికిచంపిన నేరానికి ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ్మ, ఉప్పునూతుల నర్సింహ్మ, లక్ష్మయ్య, మేకల యాదయ్య గంగదేవి చంద్రయ్య, కంటి బుచ్చయ్య, మేకల పర్వతాలుపై అప్పటి పోచంపల్లి ఎస్సై అర్జునయ్య విచారణ చేపట్టి కేసు నమోదుచేశారు. దర్యాప్తుచేపట్టిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతన్న చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కేసులో ప్రధాన ముద్దాయిలైన పై నలుగురిపై నేరం రుజువుకావడంతో అయిదవ అదనపు ప్రథమ సెషన్స్ జడ్జి జీవితకాలపు ఖైదుతోపాటు రూ.10వేల జరిమాన విధించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పులిమామిడి శశిధర్‌రెడ్డి తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కొల్చారం, సెప్టెంబర్ 9: అప్పులు తీర్చే దారిలేక కొల్చారం గ్రామానికి చెందిన రైతు ఎందుగుల యాదగిరి (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులు తెచ్చి మూడు ఎకరాల్లో వేసిన నాట్లు ఎండిపోవడంతో మధనపడ్డ యాదగిరి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించేలోపే కాలి బూడిదయ్యాడు. ఫిర్యాదు మేరకు ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ యువ రైతు బలవన్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల, గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎందుగుల యాదగిరి (34) ఇటీవల బోర్లు వేసినా ఫెయిల్ కావడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఈ వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయని గ్రామానికి వచ్చిన యాదగిరి పెట్టుబడులకు అప్పులు తీసుకువచ్చి 3 ఎకరాల పొలంలో నాట్లు వేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వేసిన నాట్లు ఎండిపోయాయ. అప్పుల ఎలా కట్టాలని మదనపడ్డ యాదగిరి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి వెళ్లేసరికి అప్పటికే మంటల్లో కాలి బూడిదయ్యాడు. కాగా, మృతుని భార్య సునీత దాదాపు రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. మృతునికి కూతురు వైష్ణవి, కొడుకు వంశీకృష్ణ ఉన్నారు. కుటుంబీకుల సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.