తెలంగాణ

న్యాయం జరిగే వరకూ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్కడి రైతులు వేములగట్‌లో వంద రోజులుగా దీక్ష చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ రైతులకు మద్దతుగా ఈ నెల 12న గజ్వేల్‌లో సభ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని శనివారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులు కొంత మంది శుక్రవారం గాంధీ భవన్‌కు చేరుకుని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి డికె అరుణ తదితరులను వేములగట్ రైతులు కలిసి తమ గోడు వినిపించారు. గ్రామాల్లో 50 రోజులుగా 144 సెక్షన్ అమలులో ఉందని, రైతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వారు ఆరోపించారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. న్యాయ స్థానాలను ఆశ్రయించడం ప్రజల హక్కు అని ఆయన తెలిపారు. న్యాయం కోసం అన్ని వేదికలలో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే శనివారం గవర్నర్‌ను కలిసిన అనంతరం 13, 14 తేదీల్లో ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నట్లు తెలిపారు.
12వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కేంద్రంలో మల్లన్న సాగర్ రైతులకు మద్దతుగా సభ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా సుప్రీం కోర్టులో కేసు వేస్తామని, రైతులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళుతున్నారని రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావు చేసిన ప్రకటనను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ ప్రజల కోసం తప్పకుండా వెళతామని అన్నారు.
భూసేకరణ విషయంలో 2013 చట్టాన్ని కాదని కొత్తగా 123 జివో తెచ్చి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ జివోను వ్యతిరేకిస్తూ తమ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా హైకోర్టులో కేసు వేశారని ఆయన చెప్పారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పునరావాస చర్యలు తీసుకుంటామని ప్రభఉత్వం చెప్పి కొత్తగా జివో 190 జారీ చేసిందని అన్నారు. అందులో కూడా సవరణలు చేయాలని కోర్టు ఆదేశాలిస్తే 10 రోజుల గడువు కావాలని కోరిన ప్రభుత్వం ఈ లోగా రైతులను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.