తెలంగాణ

ఉత్తమ్‌వన్నీ ఉత్తర ప్రగల్భాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెసోళ్ల్లు కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6లక్షల చొప్పున మంజూరు చేస్తుండగా, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని మాట్లాడడం ఆ పెద్ద పనుషులకు తగదని హితవు పలికారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 93 మంది రైతుల కుటుంబాలకు రూ. 6లక్షల చొప్పున మొత్తం రూ. 5 కోట్ల 58 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చనిపోయిన రైతు కుటుంబాల అర్జీలను వివిధ కారణాలతో తాము తిరస్కరించగా, 28 మంది రైతు కుటుంబాలకు రూ. లక్షా 50వేల చొప్పున మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. వీటిపై సమాచారం కావాలంటే కాంగ్రెస్ నేతల ఇంటికి పంపిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా విమర్శించడానికి కూడా ఓ హద్దుండాలని, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుండగా, జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఉపాధి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. కోర్టులకెళ్లి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు అడ్డుకుంటున్న కాంగ్రెస్, టిడిపిలు రాష్ట్రంలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని పేర్కొంటుండగా, రిజర్వాయర్ల నిర్మాణం కాకుండా ఎలా సాధ్యపడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు అధ్వాన్న స్థితికి చేరుకోగా, మిషన్ కాకతీయతో పూర్వ వైభవం తెచ్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గఢా అధికారి హన్మంతరావు పాల్గొన్నారు.

గజ్వేల్‌లో ఎడ్లబండిపై మార్కెట్‌యార్డ్‌కు చేరుకుంటున్న రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు