రాష్ట్రీయం

నేడు టి.ఎమ్సెట్-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ నెల 11న ఎమ్సెట్-3 నిర్వహిస్తున్నారు. ఆంధ్రా నుండి 17,939 దరఖాస్తులు వచ్చాయని, వాటితో కలిపి మొత్తం 56,153 మంది దరఖాస్తు చేశారని కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య తెలిపారు. జెఎన్‌టియులో పాత్రికేయులతో మాట్లాడుతూ అభ్యర్ధులందరి బయోమెట్రిక్ సేకరిస్తున్నామని, వాటిని అడ్మిషన్ల సమయంలో వినియోగించుకుంటామని, రానున్న రోజుల్లో స్కాలర్‌షిప్‌నకు ఆధార్‌తో ముడిపెట్టి బయోమెట్రిక్ వినియోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్ధులు శనివారం పరీక్ష కేంద్రాలను చూసుకుని ఆదివారం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన వివరించారు. హాల్‌టిక్కెట్లను కొన్ని పత్రికల్లో వచ్చినట్టు శుక్రవారంతో ముగియలేదని, శనివారం కూడా అభ్యర్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా, ఆదివారమే తొలి కీ విడుదల చేస్తామని, 15వ తేదీ నాటికి ఫలితాలను వెల్లడించేలా కమిటీ చురుకుగా ఏర్పాట్లు చేస్తోందని యాదయ్య వివరించారు.