రాష్ట్రీయం

నేనెంతో సింపుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎన్నో అవమానాలకు గురయ్యాను. నన్ను చెప్పుతో కొడతామని కూడా బెదిరించారు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణం. రాజకీయాలకన్నా రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తే మంచిది’ అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో శాసనసభ సమావేశాలు ఇవే చివరిసారని చెప్పిన చంద్రబాబు, తాను కాస్తంత భావోద్వేగంతో మాట్లాడుతున్నానని స్వయంగా అంగీకరించారు. ఈ మేరకు ఆయన శాసన మండలిలో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సుదీర్ఘంగా మాట్లాడారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చి 38 సంవత్సరాలైంది. ఎస్‌వి యూనివర్సిటీలో చదువుతూనే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాను. 1980లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కౌన్సిల్‌లోకి వచ్చాన’ని గుర్తు చేసుకున్నారు. ‘వాస్తవానికి నాకంటే నా భార్యే మంచి జీవితం గడుపుతోంది. గత 24 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంది. అవసరమైతే
ఎంటర్‌టైన్‌మెంట్‌కోసం పాతిక లక్షలు ఖర్చు చేసేందుకు కూడా ఆమెకు అధికారం ఉంది. నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సాధారణ అంబాసిడర్ కారునే ఉపయోగించాను. ఇప్పుడు సౌకర్యం కోసం, రక్షణ కోసం సఫారీ వాడుతున్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు మూడు క్యాంప్ ఆఫీసులు మార్చినా, నేను మాత్రం ఒకే క్యాంప్ ఆఫీసులో ఉంటున్నాను. నేను తీసుకునే ఆహారం కూడా సాత్వికమే. రోజూ ఉదయం రాగి లేదా జొన్న సంకటి లేదా జావ, గుడ్డులో తెల్లసొనతో రెండు మూడు ఆమ్లెట్లు. మధ్యాహ్నం భోజనానికి ముందు ఒకటి రెండు పళ్లు. మధ్యాహ్నం మళ్లీ జొన్న లేదా రాగితో చేసిన ఆహారాన్ని కొద్దిగా చేపలతో తీసుకుంటాను. సాయంత్రం డ్రైఫ్రూట్స్, రాత్రి సూప్, తేలికపాటి భోజనం తీసుకుంటాను. ప్రతిరోజూ ఉదయం వేళ వ్యాయామం చేస్తాను. లైఫ్‌ను ఇలా సింపుల్‌గా ఎంజాయ్ చేస్తాన’ని బాబు వివరించారు. చంద్రబాబు ఆహారం గురించి చెబుతుంటే సభ్యులంతా శ్రద్దగా విన్నారు.
హైదరాబాద్ సహా గోదావరి జిల్లాలు, రాయలసీమ అభివృద్ధికి తాను చేపట్టిన అభివృద్ధి పథకాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 2004నాటికి మిగులు కరెంటు ఉండేలా చూడటం తాను సాధించిన విజయాల్లో ఒకటని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివంగత నర్రా రాఘవరెడ్డిని ఆయన గుర్తు చేసుకున్నారు. కరెంటు సమస్య తలెత్తినప్పుడల్లా రాఘవరెడ్డి నల్లగొండ జిల్లా నుండి రైతులను వెంటతీసుకుని తన వద్దకు వచ్చేవారని, వెంటనే తాను తగిన చర్యలు తీసుకునేవాడినని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం బహుశా ఇవే చివరిసారి కావచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతిలో ప్రత్యేక భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, అవి త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప తదుపరి సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని తెలిపారు. అలాంటి అత్యవసర పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నానన్నారు. చివరి సమావేశాలు కావడం వల్ల కాస్త భావోద్వేగానికి గురవుతున్నానన్నారు. ఈరోజు పాత అసెంబ్లీ భవనాన్ని చూసి వచ్చానని, పాతమిత్రులతో కలసి మాట్లాడానని, ఫోటోలు కూడా దిగామని చెప్పారు. హైదరాబాద్‌ను చూస్తే ఆనందం కలుగుతుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందని, హైదరాబాద్ సాంకేతిక, ఆర్థిక లావాదేవీలకు క్యాపిటల్‌గా మారిందన్నారు. నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న హైదరాబాద్‌ను వదిలి అమరావతి వెళ్లాల్సి వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం.. సమావేశం అనంతరం శాసన మండలి నుంచి బయటకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చైర్మన్ చక్రపాణి తదితరులు