రాష్ట్రీయం

కీళ్ల మార్పిడికి అత్యాధునిక శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 10: కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సల్లో వచ్చిన ఆధునిక వైద్య పద్ధతుల్లో నైపుణ్యతను యువసర్జన్లు పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుంటూరుకు చెందిన ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చినకాకాని హాయ్‌లాండ్ ప్రాంగణంలో ఎన్నారై వైద్య కళాశాల, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఆర్థోపెడిక్స్ వైద్య సంఘాలు, విజయవాడ, గుంటూరు ఆర్థో సొసైటీల సంయుక్త ఆధ్వర్యాన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ వార్షిక సదస్సు (ఒయాసిస్-2016)లో శనివారం కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సల్లో వస్తున్న మార్పులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారం అనే అంశంపై చర్చ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సల్లో యువసర్జన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదాల్లో ఎముకలు విరిగినప్పుడు ఎటువంటి వైద్యసేవలు అందించాలో వివరించారు. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంటుందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు అన్నారు. డాక్టర్ పింగళి జయరామ్ (అపోలో), డాక్టర్ డికె సింగ్ (ఇంగ్లండ్), సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సి హనుమంతరావు, కార్యదర్శి డాక్టర్ ఎస్ అమర్‌నాథ్, డాక్టర్ సత్యకుమార్, డాక్టర్ రియాజ్, డాక్టర్ రామిరెడ్డి, కేరళ, తమిళనాడు ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లాజన్, డాక్టర్ సెల్వరాజ్ తదితరులు ప్రసంగించారు.