రాష్ట్రీయం

రేపే నోటిఫికేషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: అమరావతి రాజధాని నిర్మాణ సమగ్ర ప్రణాళిక నోటిఫికేషన్ ఆదివారం లేదా వచ్చే మంగళవారం విడుదలకానుంది. నోటిఫికేషన్ ఆధారంగా ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది. అనంతరం సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం ఎండార్స్ చేయనుంది. ప్రక్రియ ముగిసిన తర్వాతనే భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయింపు జరుగుతుంది. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రూపొందించిన ముసాయిదాపై పలు దశల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సుర్బానా కంపెనీ అమరావతి మాస్టర్ ప్లాన్, భవిష్యత్ దర్శన ప్రణాళికను తయారుచేసింది. దానిపై గతవారంలో అధికారులు, మంత్రి నారాయణ, సిఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. సవరణలను దృష్టిలో ఉంచుకుని సిఆర్‌డిఎ సిబ్బంది మాస్టర్ ప్లాన్‌లకు తుది సవరణలు చేస్తున్నారు. అది సిద్ధంకాగానే ప్రజలముందు దాన్ని ఉంచుతారు. ప్రణాళికలో కీలకాంశం దాదాపు 25 కిలోమీటర్లు పొడవైన వంకర్లులేని రహదారి నిర్మాణం. అదే రీతిలో ఢిల్లీలోని రాష్టప్రతి నిలయం, రెడ్‌ఫోర్టు కార్యాలయాలు, ప్రధాని కార్యాలయం ఉన్నట్టు అమరావతిలో సైతం సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టనున్నారు. అధికారిక కార్యాలయాలు, ప్రధానంగా రాజ్‌భవన్, అసెంబ్లీలు ఢిల్లీని తలపించేలా రూపొందిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సింగపూర్‌ను తలపించేలా ఉంటాయి. యుఎస్ పోలికతో గార్డెన్స్, చైనా పోలికతో గృహనిర్మాణం, వంపుల్లేని 25 కిలోమీటర్ల రోడ్డు ప్రతిపాదిస్తున్నారు. 30-35 ఏళ్ల తర్వాత ప్రపంచంలో అగ్రగామి నగరాలుగా చెప్పుకునేవాటిలో అమరావతి కూడా ఒకటిగా ఉండాలనేది ప్రభుత్వ యోచన. తాజా ప్రతిపాదనల ప్రకారం
రాయపూడి వద్ద అసెంబ్లీ, సచివాలయం, బోరుపాలెం వద్ద పౌర సేవల కేంద్రం, అబ్బురాజుపాలెంలో రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, దొండపాడులో స్టేట్ గ్యాలరీ, బోరుపాలెం వద్ద సివిక్ ప్లాజా, లింగాయపాలెం వద్ద రాష్టస్థ్రాయి కార్యాలయాలు, కొండమరాజుపాలెంలో హాస్పిటాలిటీ నోడ్, తుళ్లూరు సమీపంలో ప్రాంతీయ ఆస్పత్రి ఎయిమ్స్ తరహా సదుపాయాలతో నిర్మిస్తారు. ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం, వెంకటపాలెంలో కృష్ణానది ఒడ్డున కెనాల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. రాయపూడి వద్ద బొటానికల్ గార్డెన్, లింగాయపాలెం వద్ద బొటానికల్ జట్టి, వెంకటపాలెం వద్ద యూనివర్శిటీ, ఉండవల్లి వద్ద గేట్‌వే టౌన్, జరీబు భూముల్లో వెట్‌ల్యాండ్ పార్కు, కరకట్ట దిగువన సాంస్కృతిక కేంద్రం, తాళ్లాయపాలెం ఒక పక్కన కళాకేంద్రం, ఐకానిక్ టవర్, ఉద్దండ రాయునిపాలెంలో ఇండోర్ స్పోర్ట్సు సెంటర్, ఆహార శాలలు, గోల్ఫ్ కోర్టు, కనె్వన్షన్ సెంటర్, విహార కేంద్రాలు ప్రతిపాదించారు. ఇవన్నీ పూర్తి నిర్మాణం 2050 నాటికి అవుతుందని భావిస్తున్నారు.
ఈనెల 29 లేదా 30న సిఎం అధ్యక్షతన సిఆర్‌డిఎ సమావేశం జరగనుంది. సమావేశంలో ఆమోదముద్ర వేసిన తర్వాత 30న ప్రణాళిక ముసాయిదాను ప్రకటించే వీలుందని అంటున్నారు. రాజధాని కేంద్ర ప్రాంతం ప్రణాళికను జూలై 20న రాజమండ్రిలో ఈశ్వరన్ బృందం సిఎంకు అందజేసింది.