రాష్ట్రీయం

ప్రతి ఒక్కరికీ జాతీయ భావం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 10: కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా దేశంలో పుట్టిన ప్రతివారు భారతీయులం అనే జాతీయభావాన్ని కలిగి ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. శనివారం దోమలగూడ రామకృష్ణ మఠంలో జరుగుతున్న 17వ వ్యవస్థాపక దినోత్సవ, యువజనోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హిందుత్వం అనేది మతంకాదని అది ఒక జీవన విధానమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మహోన్నత దేశం భారతదేశమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఈ దేశం మనందరిదీ అనే భావం ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడే జాతీయభావం పెంపొందుతుందని అన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని, గురువును మరిచిన వాడు మనిషే కాదని, 125కోట్ల మంది భారతీయులు వారివారి కుల, మత, ప్రాంత, భాషలను గౌరవించుకుంటూనే ఇతరులను గౌరవించినప్పుడే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఆంగ్లం మోజులో మాతృభాషను మరుగున పడేయడం ఎంతో ఆవేదన కలిగించే అంశమన్నారు. అమ్మ అనే పదంలో అంతరాల్లోనుంచి వస్తుందని, ‘మమీ’ అనే పదం పెదవుల నుంచి మాత్రమే వస్తుందన్నారు. ఈ దేశంలో కష్టపడ్డ వారు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని, అంతటి స్వాతంత్య్రం ఇక్కడ మనకు ఉందన్న విషయం గుర్తించాలన్నారు. అందుకు ఉదాహరణే తమిళనాడులో పేపర్లు వేసిన అబ్దుల్ కలాం రాష్టప్రతి అయ్యాడని, రైల్వేస్టేషన్లలో టీ అమ్మిన నరేంద్ర మోదీ ప్రధాని కాగలిగారని అన్నారు. భావ స్వేచ్ఛ పేరిట కొంతమంది అసహనం అంటూ భారతదేశాన్ని నిందించడం ఆవేదన కలిగించే అంశం అన్నారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఆనందంగా ఉండటమే నిజమైన స్వేచ్చ అని, స్వేచ్ఛ ఉంది కదాని పార్లమెంట్ మీద బాంబులు విసిరిన అఫ్జల్‌గురు లాంటి వారికి అనుకూలంగా నినాదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు అయిన మనదేశంలో కుల, మత, ప్రాంత విభేదాలు కొనసాగడం బాధించే విషయమని, వాటిని వీడి అంతా భారతీయులమే అనే భావనను అలవర్చుకొని దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మతం అనేది వ్యక్తిగతమని, మన గతం మాత్రం ఒక్కటేనని అన్నారు. ఈ సమావేశంలో స్వామి జ్ఞానాంద, బోధమయనంద తదితరులు పాల్గొన్నారు.