రాష్ట్రీయం

మత్స్యకారుల వలలో అరుదైన తాబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ (విశాఖ), సెప్టెంబర్ 10: విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం మత్స్యకారుల వలకు అరుదైన సముద్రపు తాబేలు శనివారం చిక్కింది. సుమారు 200 కిలోల బరువున్న ఈ తాబేలును గతంలో ఎన్నడూ చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన సాగర్ అనే మత్స్యకారుడు శనివారం ఉదయం చేపల వేటకు బోటుపై సముద్రంలోకి వెళ్లగా చేపల కోసం వేసిన వలలో సుమారు 200 కేజీల బరువు గల అరుదైన సముద్రపు తాబేలు చిక్కింది. వలలో చిక్కిన తాబేలును మత్స్యకారులు తీరానికి తీసుకు వచ్చారు. ఈ తాబేలు పెద్దది కావడంతో పాటు వీపుపై ఉన్న బొరుసు (డిప్ప) చారలు కలిగి ఉంది. విషయం తెలిసి పరిసర గ్రామాల ప్రజలు తాబేలును చూసేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. అనంతరం మత్స్యకారులు అరుదైన తాబేలును తిరిగి సముద్రంలో విడిచి పెట్టారు.
లెదర్ బ్లాక్ సర్కిల్ తాబేలు ఇది..
ముత్యాలమ్మపాలెం మత్స్యకారుడు సాగర్ వలకు చిక్కిన అరుదైన తాబేలు ఆస్ట్రేలియా ప్రాంతంలో అధికంగా ఉంటాయని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ కేంద్రం (సిఎంఎప్‌ఆర్‌ఐ) సాంకేతిక అధికారి ఆర్‌విడి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ తాబేలు లెదర్ బ్లాక్ సర్కిల్ జాతికి చెందినదని స్పష్టం చేశారు. భారతదేశంలో అత్యధికంగా ఆలీవ్‌రిడ్లే, గ్రీన్ సర్కిల్ తాబేళ్లు కనిపిస్తాయన్నారు. లెదర్ బ్లాక్ తాబేళ్లు ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉంటాయన్నారు. ఇది అరుదైన జాతి తాబేలన్నారు.

చిత్రం.. ముత్యాలమ్మపాలెం మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన తాబేలు