రాష్ట్రీయం

ఖ్యాతి చాటేందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, డిసెంబర్ 25: గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అందాల అరకులోయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే అరకు ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు మానవవనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా అరకులోయలోని గిరిజన సంస్కృతి మ్యూజియం ప్రాంగణంలో మూడు రోజులపాటు నిర్వహించే అరకు ఉత్సవ్‌ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి, తుడుముకొట్టి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఆంధ్ర ఊటీగా అరకులోయ ఖ్యాతిగాంచిందన్నారు. దేశ చిత్రపటంలో విశిష్టస్థానాన్ని సంపాదించుకున్న అరకులోయను ఏటా దేశ విదేశాల నుంచి పర్యాటకులు సందర్శిస్తుంటారన్నారు. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలను వీక్షించడమే కాకుండా ఇక్కడి చల్లటి వాతావరణానికి పర్యాటకులు ముగ్ధులు అవుతుంటారన్నారు. అందుకనే అరకులోయను మరింతగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించామన్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ప్రత్యేక అతిథి గృహాలు నిర్మించాల్సి ఉందన్నారు. అరకులోయను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. హుదూద్ తుపానులో దెబ్బతిన్న పద్మాపురం ఉద్యానవన కేంద్రాన్ని 50 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ మన్యంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యాటక యూనిట్లు ఏర్పాటుచేసి స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఏజెన్సీలో పరిశ్రమలను నెలకొల్పాలంటే సాంకేతికపరమైన ఇబ్బందులు ఉండటంతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సిఎం చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో అరకులోయ ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గిరిజన ప్రాంతంలో ప్రాధాన్యత సంతరించుకున్న కాఫీ పంటను మరింత ప్రోత్సహించేందుకు 526 కోట్లతో పాడేరు కాఫీ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, పదేళ్లలో కాఫీ ప్రాజెక్టుతో ఏజెన్సీ స్వరూపమే పూర్తిగా మారిపోతుందన్నారు. ఇదిలావుంటే విశాఖ ఏజెన్సీలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి గిరిజన క్రీడాకారులు మరింత ఉన్నతంగా రాణించడానికి కృషి చేస్తామన్నారు. జెసి నివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక, విశాఖ నార్త్ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విఘు్ణకుమార్‌రాజు, ఐటిడిఎ పిఒ ఎం హరినారాయణన్, సబ్ కలెక్టర్ ఎల్ శివశంకర్, పర్యాటక శాఖ ప్రాంతీయ కమిషనర్ టి బాబురావునాయుడు, పర్యాటక అధికారి సిరి, డిఆర్‌డిఎ పిడి సత్యసాయి శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, సివేరి సోమ, టిడిపి నేతలు లాలం భాస్కర్, కొటియాడ అప్పారావు, సమర్థి భవాని, శెట్టి బాబురావు, పలువురు అధికారులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
చిత్రం..
తుడుం వాయించి అరకు ఉత్సవ్‌ను
ప్రారంభిస్తున్న మంత్రి గంటా