తెలంగాణ

బుద్ధ విగ్రహ పరిశీలనకు సిక్కిం చేరిన మంత్రుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం సిక్కింలో నెలకొల్పిన ఎత్తయిన బుద్ధుని విగ్రహాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నాయకత్వంలో మంత్రుల బృందం ఆదివారం సిక్కిం చేరుకుంది. కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో పాటు ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు. విగ్రహ నిర్మాణం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పలు మార్లు సమావేశం అయింది. ధ్యానమందిరం, చక్కని పార్క్, మ్యూజియంలతో సిక్కింలోని రావంగ్లలో ఏర్పాటు చేసిన బుద్ధ పార్క్ తరహాలో నగరంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచనతో దీనిని పరిశీలించాలని నిర్ణయించారు. ఆదివారం సిక్కిం చేరిన సబ్ కమిటీ 13వ తేదీ వరకు పర్యటించనుంది. రావంగ్లలో 130 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం , పార్క్, ధ్యాన మందిరాలను పరిశీలిస్తున్నారు. బుద్ధుడి 2550వ జయంతి సందర్భంగా సిక్కిం ప్రభుత్వం 2006లో ఎత్తయిన విగ్రహం నిర్మించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం సైతం అదే స్థాయిలో ఉండాలని నిర్ణయించారు.

బుద్ధుని విగ్రహ పరిశీలన కోసం సిక్కిం చేరుకున్న కడియం శ్రీహరి
నేతృత్వంలోని మంత్రుల బృందానికి స్వాగతం పలుకుతున్న సిక్కిం అధికారులు