రాష్ట్రీయం

మన సంపదను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం/ ఆకివీడు, డిసెంబర్ 25: లోకా స్సమస్తా సుఖినోభవంతు అనే సిద్ధాంతాన్ని వేదాలు ప్రవచించాయని, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి వేదాలు ప్రతీకలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్ధానం రూ 4.75 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాలను శుక్రవారం రాష్టప్రతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదపాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదైన వేదాలను కాపాడుకోవాల్సిన పవిత్ర బాధ్యత అందరిపై ఉందన్నారు. వేదంద్వారా జ్ఞానం పెంపొందుతుందన్నారు. వేదాలవల్లే ప్రపంచం శాంతితో విరాజిల్లుతోందన్నారు. దేశాలమధ్య అనుబంధాన్ని, స్నేహభావాన్ని ఇవి పెంపొందిస్తాయన్నారు. వసుదైక కుటుంబం అనే భారతీయ ఆధ్యాత్మిక భావన ప్రపంచ దేశాలపట్ల మనకున్న దృక్పథాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుందన్నారు. యునెస్కో వేదాలను వౌఖిక వారసత్వ సంపదగా గుర్తించిందన్నారు. భారతీయ సాంస్కృతిక విలువలకు వేదాలు పటిష్టమైన పునాది అని, అలాంటి వేద విద్య కోసం తితిదే పాఠశాల ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. పురాతనకాలంలో మునులు, సాధువులు నెలకొల్పిన అత్యుత్తమ బోధనా కేంద్రాలను తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేదపాఠశాలలు గుర్తు చేస్తున్నాయన్నారు. వేదాల పరిరక్షణకు తితిదే ఇతోధిక కృషి చేస్తోందని ప్రశంసించారు. వేదసారాన్ని స్పష్టంగా నిర్వచించగలిగినప్పుడే వాస్తవ సందేశం అర్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు మాట్లాడుతూ వేద పఠనం ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం కలుగుతుందన్నారు. గోదావరి సమీపంలో వేదపాఠశాల ఏర్పాటుకు గొప్ప విషయమన్నారు. తితిదే చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ వెయ్యిమంది విద్యార్ధులకు 100 మంది బోధకులతో 17 కోర్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. రూ.40 కోట్ల వార్షిక బడ్జెట్‌తో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.
ముందుగా తితిదే మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి, గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబుకు శ్రీవారి ప్రతిమలు బహూకరించారు. కార్యక్రమంలో ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, ఎంపీ తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు, టిటిడి జెఇఒ పి భాస్కర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
రాష్టప్రతికి ఘన స్వాగతం
రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఆకివీడు మండలం ఐ భీమవరానికి విచ్చేసిన సందర్భంగా ఘనస్వాగతం లభింఛింది. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, సిఎం చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్టప్రతికి సిఎం బాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అడిషనల్ డిజిపి ఆర్‌పి ఠాకూర్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌లు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు రాష్టప్రతిని దుశ్శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు.
చిత్రం..
తిరుమల సందర్శనలో భాగంగా శ్రీవారి ఆలయంలోని ధ్వజ స్తంభానికి నమస్కరిస్తున్న రాష్టప్రతి ప్రణబ్