తెలంగాణ

మహారాష్టల్రోనూ ఇక మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మహారాష్టల్రో తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ఎనిమిది జిల్లాల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు అమలు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బబస్‌రావు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇంజనీర్లతో కలిసి బబస్‌రావు నారాయణఖేడ్, ఆందోల్, మెదక్ నియోజక వర్గాల్లో మిషన్ భగీరథ పనులు జరుగుతున్న తీరును స్వయంగా చూశారు. ఇంత తక్కువ కాలంలో అంత పనులు ఎలా సాధ్యం అయ్యాయని మంత్రి విస్తుపోయారు.
గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం ఒప్పందం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముంబయి వచ్చినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరుగుతున్న పనులు, మిషన్ భగీరథ గురించి వివరించారని బబస్‌రావ్ తెలిపారు. ఇంత పని జరిగిందని, ఇంటింటికి నీటిని అందించే ప్రాజెక్టు చేపట్టామని కెసిఆర్ చెప్పడంతో అది ఎలా సాధ్యం అయిందో, ఏ విధంగా అమలు చేస్తున్నారో చూసి రావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెళ్లి రమ్మంటే ఇంజనీర్లతో కలిసి వచ్చినట్టు బబస్‌రావ్ తెలిపారు. తెలంగాణ కొత్త రాష్ట్రం అయినా ఇంటింటికి మంచినీటిని అందించేందుకు చేస్తున్న ప్రయత్నం అద్భుతం అని మంత్రి అన్నారు. మెదక్ జిల్లా సింగూర్‌లో మిషన్ భగీరథ పనులు చూశారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేటలో నిర్మిస్తున్న ఇంటెక్ వెల్‌ను చూశారు. 90 ఎంఎల్‌డి సామర్థ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను చూశారు. ఇంత తక్కువ సమయంలో నిర్మించేందుకు ఇంజనీర్లు పడిన శ్రమ తెలుస్తోందని అన్నారు. స్లిప్‌ఫాం టెక్నాలజీతో రోజుకు రెండు మీటర్లు కడుతున్నామని ఆర్‌డిఎస్ అండ్ ఎస్‌ఇఎన్‌సి సురేందర్‌రెడ్డి మంత్రికి తెలిపారు. ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఆ రాష్ట్ర ఇంజనీర్లకు మంత్రి తెలిపారు.
గ్రామంలోని వెంకన్న గుడిలో బబస్‌రావు పూజలు చేశారు. మరాఠ్వాడాలో ఎనిమిది జిల్లాలకు మంచినీటిని అందించిన తరువాత మళ్లీ ఈ గుడికి వస్తానని మొక్కుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో ఆర్‌డబ్లుయస్ ఈఎన్‌సి సురేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్‌రెడ్డి, మెదక్ ఎస్‌ఇ విజయప్రకాశ్, కన్సల్టెంట్లు నర్సింగరావు, మనోహర్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.