రాష్ట్రీయం

మెడికల్ అడ్మిషన్లకు 17నుంచి కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఎమ్సెట్-3లో అర్హులకు మెడికల్, డెంటల్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ షెడ్యూలును కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ ప్రకటించింది. 17 నుంచి 20 వరకూ నాలుగు రోజుల పాటు అర్హత సాధించిన అభ్యర్థులకు ర్యాంకుల వారీ సర్ట్ఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు. వెబ్ కౌనె్సలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను కెఎన్‌ఆర్ మెడికల్ యూనివర్శిటీ ఏర్పాట్లు చేసింది. ఏయే ర్యాంకుల అభ్యర్థులు ఏయే కేంద్రాల్లో సర్ట్ఫికెట్ల పరిశీలన జరిపించుకోవాలో ఆన్‌లైన్‌లో వర్శిటీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్శిటీ పిజిఆర్‌సిడిఇ, మారేడ్‌పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, గగన్‌మహల్‌లో ఎవి కాలేజీ, వరంగల్‌లో కాకతీయ వర్శిటీ, స్థానికేతర అభ్యర్థులకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీల్లో కౌనె్సలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివిధ రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులకు కూకట్‌పల్లి జెఎన్‌టియులో కౌనె్సలింగ్ ఉంటుంది. 17న ఉదయం 9 గంటలకు స్పోర్ట్సు, గేమ్స్ అభ్యర్థులకు, 18న ఉదయం 9 నుండి ఎన్‌సిసి అభ్యర్థులకు , 19న ఆర్మీ, పోలీసు అమరవీరుల కుటుంబాలు, పిహెచ్‌సి అభ్యర్థులకు కౌనె్సలింగ్ ఉంటుంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్‌లో 1000 ర్యాంకుల వరకూ 17న ఉదయం, 2000 ర్యాంకుల వరకూ సాయంత్రం కౌనె్సలింగ్ జరుపుతారు. 18న 2001 నుండి 4500 ర్యాంకు వరకూ, 19న 4501 నుండి 9000 ర్యాంకు వరకూ, 20న 9001 నుండి తుది ర్యాంకు వరకూ కౌనె్సలింగ్ జరుగుతుంది.
తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్ -3లో ఎలాంటి పొరపాట్లు లేవని ఎమ్సెట్ కమిటీ పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన
సోమవారం ప్రారంభమైంది. కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో ప్రశ్నలు గందరగోళానికి గురిచేశాయన్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు రావడంతోపాటు కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని పలువురు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపారు. ఫిజిక్స్‌లోనూ కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని, జువాలజీలో ఒక ప్రశ్నకు రెండు సరైన ఆప్షన్లు ఇవ్వగా, మరో మూడు ప్రశ్నల్లో అక్షరదోషాలు ఉన్నాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్ధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. కొన్నింటికి ఆప్షన్లలో సరైన జవాబులేదని, మరికొన్ని ఇంటర్ సిలబస్‌దాటి ఇచ్చినవే ఉన్నాయని, కెమిస్ట్రీ ఫార్ములాల్లో తప్పులు వచ్చాయని, జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీల్లో కలిపి మొత్తం 22 తప్పులు వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.