రాష్ట్రీయం

ఏపీలో కంటింజెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: కాంట్రాక్ట్ కంటింజెంట్, పార్ట్‌టైం ఉద్యోగుల జీతాల పెంపుదలపై ఉద్యోగ సంఘాల జెఎసి ఈ నెల 27న అన్ని జిల్లా డివిజన్ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో సోమవారం విజయవాడలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం, కార్యదర్శి ఎం.రవిచంద్ జిఎస్‌సి నేతలతో జరిపిన తొలి విడత చర్చలు సఫలమయ్యాయి. ఈ విషయాన్ని త్వరలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు దృష్టికి తీసుకెళ్లగలమని ఆయన తుది నిర్ణయం తీసుకోగలరని అజయ్ కల్లం చెప్పారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్ని డిమాండ్లపై కూలంకుషంగా చర్చించామని జెఎపి చైర్మన్ పి.అశోక్‌బాబు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చెయ్యాలని కేబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన తగదని, కోర్టు తీర్పులు అర్హత వున్నవారికి అడ్డంకి కావనే విషయాలను ప్రభుత్వం ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 10 నెలల పిఆర్‌సి బకాయిలను వెంటనే చెల్లించాలని ఇప్పటికే కాలయాపన జరిగిందని తెలిపారు. 70ఏళ్లు దాటిన పెన్షనర్లకు వెయిటేజ్ చెల్లించాలని పిఆర్‌సి కూడా ఈ విషయాన్ని రికమెండ్ చేసిందని తెలిపారు. పబ్లిక్ సెక్టారు, గురుకుల ఉద్యోగుల పిఆర్‌సి విషయం పార్ట్‌టైం ఉద్యోగుల జీతాన్ని రూ.8వేలు పెంపు, జూనియర్ కాలేజీ లెక్చరర్ల స్కేలు ఫిక్సేషన్ తదితర అంశాలపై కూడా చర్చ జరిగిందని వచ్చేవారం ఆర్ధిక మంత్రితో మరల చర్చలు ఉంటాయని తెలిపారు.