రాష్ట్రీయం

ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరిఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి వెళ్ళడం వల్ల ఇరు దేశాల మధ్య మరింత సత్సంబంధాలు నెలకొనడానికి ఉపయోగపడుతుందని, ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లేనని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
ప్రధాని మోదీ కాబూల్ పర్యటన నుంచి తిరిగి స్వదేశానికి వస్తూ అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో ఆగడం ద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలలో కొత్త ఆధ్యాయానికి నాంది పలికుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర అన్నారు. మాజీ ప్రధాని అటల్ బీహర్ వాజ్‌పేయి 91వ జన్మదినం సందర్భంగా శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో నగరంలో విసృత్త కార్యకర్తల సమావేశం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శాంతిని పెంపోందించాడానికి నరేంద్రమోడి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ఆధికారంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇతర దేశాలలో ఎవరు గుర్తుకుడా పట్టలేదని ఎద్దేవా చేశారు. కేంద్రం సంపన్నవర్గాల ప్రభుత్వమని ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. పేదరికం లేని దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తుందని, జిహెచ్‌ఎంసిపై బిజెపి జెండా ఎగుర వేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని, సుపరిపాలన అందించారిని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి అవకాశం కల్పిస్తే విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సభకు ముందు ‘మన హైదరాబాద్’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగరంలోని సమస్యలపై డ్యాకుమెంటరిని ప్రదర్శించారు.
కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసనసభ పక్షనేత డా.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతాల రాంచంద్రారెడ్డి, ఎన్‌వివిఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి, నగర నాయకుడు వెంకట రమణి తదితరులు పాల్గొన్నారు.