రాష్ట్రీయం

తెలంగాణలో ఎంబిఎ, ఎంసిఎ సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ సోమవారం రాత్రి పూర్తయిందని అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. 23 ప్రభుత్వ కాలేజీల్లో 1390 ఎంబిఎ సీట్లకు 1363, 267 ప్రైవేటు ఎంబిఎ కాలేజీల్లో 21,006 సీట్లకు 20654 సీట్లు భర్తీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎంబిఎలో కన్వీనర్ కోటా కింద కేవలం 379 సీట్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. 14 ప్రభుత్వ ఎంసిఎ కాలేజీల్లో 680 సీట్లకు 629, 24 ప్రైవేటు ఎంసిఎ కాలేజీల్లో 1229 సీట్లకు 1223 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా 17వ తేదీన ఫీజులు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. నూరు శాతం సీట్లు 284 కాలేజీల్లో భర్తీ కావడం ఈసారి విశేషమని పేర్కొన్నారు.