రాష్ట్రీయం

ఐఐటిల్లో.. విదేశీ విద్యార్థులకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: విదేశీ విద్యార్ధులకు ఐఐటి మెయిన్స్ నుండి మినహాయించాలని జాయింట్ అడ్మిషన్స్ బోర్డు యోచిస్తోంది. ప్రధానంగా సార్క్ దేశాలైన ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులులతో పాటు సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియాలకు చెందిన విద్యార్ధులు నేరుగా ఐఐటి జెఇఇ అడ్వాన్స్ పరీక్షలో పోటీపడి సీట్లు సాధించుకునేలా అంతర్జాతీయ విద్యార్ధులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ యోచిస్తోంది. అవసరమైతే ఈ దేశాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడి విద్యార్ధులు పెద్ద ఎత్తున పరీక్షలు రాసేలా చూడాలని కూడా యోచిస్తోంది.
ప్రస్తుతం జెఇఇ మెయిన్స్ పరీక్షను కొలంబో, ఖాట్మండు, సింగపూర్, బహ్రెయిన్, దుబాయి, మస్కట్, రియాద్, షార్జాల్లో నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ పరీక్షను కేవలం దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ కారణాలతో అక్కడి విద్యార్ధులకు ఐఐటిలు చేతికి అందని విద్యాసంస్థలుగా మారాయి. ఈ క్రమంలోనే మరికొన్ని దేశాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఐఐటి జాయింట్ అడ్మిషన్స్ బోర్డుకు సూచించింది. అమెరికా, యుకె వంటి దేశాల్లో కంటే చిన్న దేశాలకు చెందిన విద్యార్ధులను ఆకర్షించడం తేలికగా ఉంటుందని భావిస్తున్న ఐఐటి కౌన్సిల్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కామన్ మెరిట్ లిస్టులో ఉండటంతో పాటు టాప్ 20 పర్సంటైల్, కనీసం 75 శాతం మార్కులు రావాలనే నిబంధనలను సైతం విదేశీ విద్యార్ధులకు మినహాయించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నత విద్యాసంస్థలుగా గుర్తింపు పొందాలంటే విదేశీ విద్యార్ధుల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంతో ఆ దిశగా ఐఐటి కౌన్సిల్ చర్యలు చేపట్టింది.