ఆంధ్రప్రదేశ్‌

లంచ్‌మోషన్ తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అమరావతి రాజధాని నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానం నోటిఫికేషన్లపై సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన స్టేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ అపీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్‌రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఎదుట ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కిందికోర్టు ఇచ్చిన స్టేపై అపీల్ చేశారు. లంచ్‌మోషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏజి అభ్యర్థించారు. కాని అపీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం నుంచి తమకు అఫిడవిట్లు, ఇతర సమాచారం ఏమీ అందలేదని ధర్మాసనానికి తెలిపారు. ఏజి దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అపీల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మాత్రమే ధర్మాసనాన్ని కోరుతున్నామని, ధర్మాసనం అనుమతిస్తే, పిటిషనర్లు కోరిన అఫిడవిట్లు, సమాచార పత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని సాధారణ పిటిషన్ సరిపోతుందని సూచించింది. కాని కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా గురువారమే కేసు విచారణను చేపట్టాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. అనంతరం అపీల్‌ను రిజిస్ట్రీ వద్ద ఏజి ఫైల్ చేశారు. గురువారం కేసు విచారణకు వీలుగా లిస్టు చేశారు.