తెలంగాణ

రెట్టింపు ధాన్యం సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఈ ఖరీఫ్ సీజన్‌లో 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యం నిరుడు సేకరించిన ధాన్యంకంటే రెట్టింపని మంత్రి వివరించారు. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యానికి చెల్లింపులు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్), కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పౌరసరఫరా శాఖలో ఉద్యోగులు, గోదాంల విభజన తదితర అంశాలపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సమీక్ష జరిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్‌తో కలిసి జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల జిల్లా అధికారులతో మంత్రి ఈటెల చర్చించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు బాగా కురవడంతో దిగుబడి పెరుగుతుందన్న అంచనాతో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని రెట్టింపు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే రైతులకు చెల్లింపులు జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈనెల 30న నిర్ణీత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సిఎంఆర్ బకాయిలను రాబట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే రూ.203 కోట్లు మిల్లర్ల నుంచి వసూలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈనెల 21 వరకు సిఎంఆర్ కింద మిల్లర్లు రూ.482 కోట్లు విలువ చేసే లక్ష 81 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా రూ. 203 కోట్ల విలువ చేసే 76 వేల 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించామన్నారు. నెలాఖరులోగా మిగతా లక్ష్యం మేరకు సేకరిస్తామని సివి ఆనంద్ వివరించారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పౌరసరఫరాల గోదాంలు ఏయే జిల్లాల పరిధిలోకి రానున్నాయో జాయింట్ కలెక్టర్లు నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అలాగే కొత్త జిల్లాలకు కేటాయించే ఉద్యోగుల ప్రతిపాదనను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రేషన్ షాపులకు తరలించే బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ నంబర్లు సేకరించి సరుకుల రవాణాపై ఎప్పటికప్పుడు వారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తామని కమిషనర్ చెప్పారు. ఫోన్ నంబర్లను సేకరించి త్వరలోనే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయబోతున్నట్టు కమిషనర్ తెలిపారు.