అంతర్జాతీయం

పారిస్ ఒప్పందానికి త్వరలోనే ఆమోదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 14: పర్యావరణ మార్పుపై పారిస్‌లో జరిగిన చరిత్రాత్మక ఒప్పందాన్ని భారత్‌సహా మరికొన్ని దేశాలు త్వరలోనే ఆమోదిస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరాంతం నుంచి ఒప్పందం అమలు కావాలంటే దీన్ని భారత్‌సహా మరికొన్ని దేశాలు రాటిఫై చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత ప్రధాన మంత్రిని బాన్ కీ మూన్ సంప్రదిస్తున్నారని ఆయన ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ తెలిపారు. వచ్చేవారం జరగనున్న పర్యావరణ సదస్సుకు మరికొన్ని దేశాలు ఆమోదానికి సంబంధించిన ప్రతిపాదనలతో రానున్నాయని, ఇంకొన్ని ఆ తరువాత ఆమోదిస్తామని హామీ ఇచ్చాయని, మొత్తంమీద ఈ ఏడాది చివరినాటికి రాటిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుందని స్టీఫెన్ అన్నారు. పర్యావరణ ఒప్పందంపై భారత్‌ను అంగీకరింపజేయడానికి ఆ దేశ నాయకత్వంతో ఐరాస చీఫ్ మంతనాలు జరుపుతున్నారన్నారు. ‘ఈ ఏడాది చివరినాటికి తప్పకుండా భారత్ అంగీకరిస్తుందని భావిస్తున్నాం’ అని స్టీఫెన్ పేర్కొన్నారు. ఐరాస 71వ జనరల్ అసెంబ్లీ సదస్సు సందర్భంగా ప్యారిస్ ఒప్పందంపైనా విడిగా స్వల్ప సదస్సు జరగనుంది. ‘కొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు. మరికొందరు తక్కువ సమయం తీసుకుంటారు. సెక్రటరీ జనరల్ సభ్యదేశాలన్నింటితో నిరంతరంగా చర్చలు జరుపుతున్నారు’ అని స్టీఫెన్ అన్నారు.