ఆంధ్రప్రదేశ్‌

లింగాలగట్టులో విరిగిపడిన కొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 14: శ్రీశైలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియ విరిగి పడింది. లింగాలగట్టులోని పెద్దబ్రిడ్జి వద్ద కొండచరియ విరిగి ఓ పెద్దరాయి పడడంతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లింగాలగట్టులోని కొండచరియలు నాని బండరాళ్లు కిందికి దొర్లుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెద్దబ్రిడ్జి వద్ద ఉన్న బోయ శీను ఇంటిపై కొండ చరియ నుంచి వేరుపడిన పెద్ద రాయి పడింది. రేకుల షెడ్డుపై బండరాయి పడడంతో ఇంట్లోని ఫ్రిజ్, కూలర్, ఫ్యాను ధ్వంసమయ్యాయి. కుటుంబసభ్యులు పక్కగదిలో నిద్రిస్తుండడంతో ప్రాణనష్టం తప్పింది. రాత్రి పెద్దశబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచిన కుటుంబసభ్యులు పక్కగదిలోకి వెళ్లి చూడగా పెద్ద బండరాయి కనిపించడంతో ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని వారిని ఓదార్చారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు బుధవారం ఉదయం సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రాయిని తొలగించే పనులు చేపట్టారు.