ఆంధ్రప్రదేశ్‌

మాకొద్దీ ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 14: గ్రామాన్ని నాశనం చేసే కెమికల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటూరు గ్రామస్తులు ముక్తకంఠంతో నినదించారు. అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులు, ఫ్యాక్టరీ యజమానిని అడ్డుకున్నారు. నీళ్లట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హె చ్చరించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటూరులో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండజూటూరు గ్రామంలో శాంతిరామ్ నానో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించే క్రమంలో అవగాహన కల్పించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, పాణ్యం తహశీల్దార్ చంద్రావతి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫ్యాక్టరీ యజమాని శాంతిరామ్ హాజరయ్యారు. సుమా రు 1500 మంది కాలుష్యానికి కారణమయ్యే కెమికల్ ఫ్యాక్టరీ అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ గ్రామ ప్రజలకు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. ఇంతలో కొంతమంది సమీపంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హె చ్చరించారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కలెక్టర్ విజయమోహన్ ఓ పక్క ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. గందరగోళం మధ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అర్ధాంతరంగా కార్యక్రమాన్ని రద్దుచేసుకుని వెళ్తుండగా కుర్చీలు, రాళ్లు విసిరారు. నానో కెమికల్ ఫ్యాక్టరీ యజమాని డాక్టర్ శాంతిరాముడు, ప్రాణభయంతో ఆర్డీవో జీపు ఎక్కడంతో ప్రజలు జీపుపై రాళ్లురువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గ్రామస్తులను తరిమివేశారు.

కొండజూటూరులో అధికారులను అడ్డుకుంటున్న ప్రజలు